రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ !! ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ అందుబాటులోకి

రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ !! ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ అందుబాటులోకి

Phani CH

|

Updated on: Dec 11, 2024 | 6:56 PM

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ విప్లవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలకబోతోంది. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశలవారీగా ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించనుంది. ఇది వైఫై కనెక్షన్‌ లాంటిది. ఈ కనెక్షన్‌ తీసుకుంటే వర్చువల్‌ నెట్‌వర్క్‌తో పాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలను గ్రామీణ ప్రజలు చూడటానికి వీలుపడుతుంది.

మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం దీనిని ప్రారంభిస్తారు. తరువాత మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తిచేయనున్నారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించే లక్ష్యంతో భారత్‌ నెట్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ.2,500 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను టీ ఫైబర్‌ సంస్థ తీసుకుంది. ప్రతి ఇంటికి రూ.300కే ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ కనెక్షన్‌ తీసుకుంటే ప్రతి ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌గా మారుతుందని అధికారులు చెబుతున్నారు. 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో కనెక్షన్‌ ఇస్తారు. ఈ కనెక్షన్‌ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా ?? ఎంత ప్రమాదమో తెలుసా ??

TOP 9 ET News: రూ.1000 కోట్ల దిశగా పుష్ప2 | యానిమల్‌ డైరెక్టర్‌తో చిరు

రోహిణీ పంట పండింది.. బిగ్ బాస్ నుంచి భారీగా రెమ్యునరేషన్ !!

సీరియల్ నటితో రెండో పెళ్లి.. 46 ఏళ్ల వయసులో సాయి కిరణ్‌ లవ్‌స్టోరీ !!

Siddu Jonnalagadda: మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టిల్లు సాబ్‌ !!