గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే క్రూరమృగాల తీసుకెళ్లింది !!
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. చివరికి పోలీసుల సాయంతో బయటపడి ఊపిరి పీల్చుకుంది. బీహార్‌కు చెందిన రాజ్‌దాస్ రంజిత్‌దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరింది. ఈ కుటుంబంలో చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు.
గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్ దాటిన తర్వాత షిరోడగ, హెమ్మగూడ గ్రామాల మధ్య గుండా గూగుల్ మ్యాప్స్ దారి చూపించింది. దానిని అనుసరించి వెళ్లిన వారు భీమ్‌గఢ్ వైల్డ్ లైఫ్ జోన్‌లో ఏడు కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో ఎవరినీ సాయం అర్థించే అవకాశం లేకుండా పోయింది. అక్కడి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో అటవీ జంతువుల బారినపడకుండా కారును లాక్ చేసుకుని రాతంత్రా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. తెల్లవారాక వెళ్లిన దారిలోనే వెనక్కి మూడు కిలోమీటర్లు రావడంతో మొబైల్ నెట్‌వర్క్ వచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబం వెంటనే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పరిస్థితి చెప్పింది. వెంటనే స్పందించిన బెలగావి పోలీస్ కంట్రోల్ రూం ఖానాపూర్ పోలీసులకు సమాచారం చేరవేసింది. వారు గ్రామస్థులు, జీపీఎస్ సాయంతో కుటుంబాన్ని గుర్తించి రక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Capsicum: క్యాప్సికం తింటే ఇన్ని ప్రయోజనాలా ??
నెయిల్ పాలిష్‌ను ఇలా ఈజీగా రిమూవ్ చేయచ్చు
రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ !! ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ అందుబాటులోకి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

