Capsicum: క్యాప్సికం తింటే ఇన్ని ప్రయోజనాలా ??
క్యాప్సికం తినడానికి కొందరు ఇష్టపడరు. కానీ, క్యాప్సికమ్‌లో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఇందులో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
క్యాప్సికమ్ తినడం వల్ల అది శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతను కూడా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి క్యాప్సికమ్ చక్కగా ఉపయోగపడుతుంది. క్యాప్సికమ్ లో ఉబకాయాన్ని కరిగించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాప్సికంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్యాప్సికంలో ఉండే గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే క్యాప్సైసిన్.. యూరిక్ యాసిడ్ ను నియంత్రించేందుకు దోహదపడుతుంది. కంటి ఆరోగ్యానికి క్యాప్సికమ్ చాలా బాగా పనిచేస్తుంది. క్యాప్సికమ్ లో లుటిన్, జియాక్సంతిన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికంలో ఉండే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించడంలో క్యాప్సికం కీలకంగా పనిచేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెయిల్ పాలిష్‌ను ఇలా ఈజీగా రిమూవ్ చేయచ్చు
రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ !! ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ అందుబాటులోకి