'పుష్ప-2' పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!

‘పుష్ప-2’ పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!

Phani CH

|

Updated on: Dec 11, 2024 | 8:44 PM

'పుష్ప-2' సినిమాకు ఉత్తరాదిలో ఎక్కువ థియేటర్స్‌ కేటాయించడంపై కొందరు పెద‌వి విరుస్తున్నారు. ఈ సినిమా కారణంగా హాలీవుడ్‌ హిట్ మూవీ 'ఇంటర్‌స్టెల్లార్‌' రీ రిలీజ్‌ వాయిదా పడిందంటూ విమర్శిస్తూ ప‌లువురు పోస్టులు పెడుతున్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్‌ నటించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది.

తాజాగా ఈ మూవీ విడుద‌లై ప‌దేళ్లు పూర్తి చేసుకోవ‌డంతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా రీ – రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఎక్కువ శాతం ఐమాక్స్ థియేట‌ర్లలో ‘పుష్ప-2’ ఉండటం వల్ల మ‌న ద‌గ్గర‌ ‘ఇంటర్‌స్టెల్లార్‌’ రీ రిలీజ్‌ పోస్ట్‌పోన్ అయింది. దీంతో కొందరు అల్లు అర్జున్ సినిమాకు ఎందుకు ఎక్కువ థియేటర్స్ కేటాయించారంటూ నెట్టింట పోస్టులు చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి ఓ పోస్టుపైనే తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ స్పందించారు. హాలీవుడ్ వారే మ‌న సినిమాల‌ను మెచ్చుకుంటున్నార‌ని, కానీ మ‌నం మాత్రం మ‌న చిత్రాల‌ను త‌క్కువ చేసుకుంటున్నామంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే క్రూరమృగాల తీసుకెళ్లింది !!

Capsicum: క్యాప్సికం తింటే ఇన్ని ప్రయోజనాలా ??

నెయిల్ పాలిష్‌ను ఇలా ఈజీగా రిమూవ్ చేయచ్చు

రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ !! ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ అందుబాటులోకి