Ram Gopal Varma: పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్ ఇండియా మూవీ కాదు..
పుష్ప2 ‘ఆలిండియా ఇండస్ట్రీ హిట్’ అంటూ ఒక్క ముక్కలో రివ్యూ చెప్పేసిన రామ్‌గోపాల్ వర్మ తాజాగా పుష్ప-2 మూవీపై మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అందులో పుష్ప పానఇండియా మూవీ కాదని పేర్కొన్నారు. 'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా బుధవారం పెట్టిన ఓ పోస్టులో హీరో అల్లు అర్జున్‌పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అంటూ కితాబిచ్చారు.
పుష్పా-2.. హిందీలో సృష్టించిన వసూళ్ల రికార్డులనుద్దేశించి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘హిందీలో డబ్బింగ్ చిత్రం సత్తా చాటింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప 2’ హిస్టరీ క్రియేట్ చేసింది. నాన్ హిందీ యాక్టర్ అల్లు అర్జున్ అక్కడ బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారు. అందుకే ఇది పాన్ ఇండియా కాదు తెలుగు ఇండియా సినిమా’’ అని పేర్కొన్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలై ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మూడు రోజుల్లో హిందీలో రూ.205 కోట్లకుపైగా వసూళ్లు చేసిందని చిత్ర బృందం వెల్లడించింది. రిలీజ్ రోజే రూ.72 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డు నెలకొల్పింది. రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లు వసూళ్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.294 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకూ.. ఫస్ట్‌డే అంత పెద్ద మొత్తం వసూళ్లను రాబట్టిన భారతీయ సినిమా ఇదే. వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో రూ.621 కోట్లు వసూలు చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.