మరికాసేపట్లో పెళ్లి.. ఆభరణాలు మిస్.. కట్ చేస్తే !!

మరికాసేపట్లో పెళ్లి.. ఆభరణాలు మిస్.. కట్ చేస్తే !!

Phani CH

|

Updated on: Dec 11, 2024 | 9:14 PM

అనంతపురం జిల్లా పామిడిలో ఓ ఫంక్షన్ హాల్‌లో మరికాసేపట్లో పెళ్లి అనగా పెళ్లికూతురు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. కంగారుపడిన వధువు కుటుంబ సభ్యులు… అప్పటికి ఎలాగోలా కుటుంబ సభ్యుల ఆభరణాలు పెళ్ళికూతురుకు అలంకరించి పెళ్లి తంతు ముగించారు. వెంటనే వధువు కుటుంబ సభ్యులు.. ఆభరణాలు మిస్ అవ్వడంపై పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లి అయిన కాసేపటికి విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిసాయి. పెళ్లి కూతురుకి మేకప్ వేయడానికి వచ్చిన బ్యూటీషియనే… ఆభరణాలు సర్దేసిందని పోలీసులు గుర్తించారు. కేవలం మూడు గంటల వ్యవధిలోని కేసును ఎంతో చాకచక్యంగా చేదించారు. ఫంక్షన్ హాల్‌లో పెళ్లికూతురుని రెడీ చేసే గదిలోకి ఎవరెవరు వెళ్లారు అని సిసి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు… వధువు, వధువు తల్లి, అక్కతో పాటు బ్యూటీషియన్ అనూష ఆ గదిలోకి వెళ్లారని పోలీసులు గుర్తించారు. వధువు గదిలోని సీలింగ్‌లో బంగారు ఆభరణాలు ఉంచే ఖాళీ పెట్టెలు పోలీసులు గుర్తించారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు, బ్యూటిషియన్ అనూష తప్ప… బయట వారెవరు గదిలోకి రాలేదని తెలుసుకున్న పోలీసులు… ఉరవకొండలో ఉంటున్న అనూష ఇంటికి వెళ్లి తమదైన శైలిలో విచారించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డబ్బుల కోసం యూట్యూబర్లు ఇలా కూడా చేస్తారా ??

Bleeding Eye: కరోనా కంటే డేంజర్‌.. బ్లీడింగ్ ఐ వైరస్ !!

ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!

జలుబు, దగ్గు, గొంతునొప్పికి ఇంటి చిట్కాలు

‘పుష్ప-2’ పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!