WATCH: మారని ఆ యంగ్ ప్లేయర్ తీరు.. మళ్లీ లైవ్ మ్యాచ్‌లో గొడవ.. ఈ సారి స్నేహితుడితోనే

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు గొడవ పడ్డారు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

WATCH: మారని ఆ యంగ్ ప్లేయర్ తీరు.. మళ్లీ లైవ్ మ్యాచ్‌లో గొడవ.. ఈ సారి స్నేహితుడితోనే
Ayush Badoni And Nitish Rana
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 12, 2024 | 7:56 AM

ఈ భారత దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని చాలా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ టోర్నీలో చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంపైర్ వారికి నచ్చజెప్పి వివాదాన్ని సద్దుమణిగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సయ్యద్ ముస్తాక్ అలీ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఈ ఘటన జరిగింది. నిజానికి ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఉత్తరప్రదేశ్ ఆటగాడు నితీష్ రాణా బౌలింగ్ చేస్తున్నాడు. కాగా ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని క్రీజులో ఉన్నాడు. అతను నితీష్ ఓవర్లో షాట్ ఆడాడు.  ఒక పరుగుతో నాన్ స్ట్రైక్ చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. నితీష్ రాణానే గొడవకు దిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంపైర్‌ జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిగించారు.ఆయుష్ బడోని, నితీష్ రాణా అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. నితీష్ రాణా గతంలో ఢిల్లీ జట్టుకు మాత్రమే ఆడేవాడు. కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే 2023లో యూపీ తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతను IPL 2023 సందర్భంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన హృతిక్ షౌకీన్‌తో కూడా గొడవపడ్డాడు.

ఢిల్లీ జట్టు విజయం సాధించింది

ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనుజ్ రావత్ 33 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కాగా ప్రియాంష్ ఆర్య 44 పరుగులు, యష్ ధుల్ 42 పరుగులు అందించారు. మరోవైపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ జట్టు 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. నితీష్ రాణా 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి