Manchu Manoj: దయచేసి అలాంటివి నమ్మకండి.. అభిమానులకు విజ్ఞప్తి చేసిన మంచు మనోజ్
ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గాను వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత ఏడాది మనోజ్ వివాహబంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకున్నారు. అయితే మనోజ్ కు గతంలోనే పెళ్లైన విషయం తెలిసిందే. ఆమెతో విడిపోయిన తర్వాత మౌనికను పెళ్లాడరు మనోజ్.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.. త్వరలోనే ఆయన వరుసగా సినిమాలు చేసి తిరిగి అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గాను వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత ఏడాది మనోజ్ వివాహబంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకున్నారు. అయితే మనోజ్ కు గతంలోనే పెళ్లైన విషయం తెలిసిందే. ఆమెతో విడిపోయిన తర్వాత మౌనికను పెళ్లాడరు మనోజ్. మౌనికాకు కూడా ఇది రెండో వివాహమే.. ఇక ఈ ఇద్దరూ త్వరలోనే తల్లి దండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. గతేడాది డిసెంబర్‌లోనే అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పారు మనోజ్ దంపతులు.
అయితే మౌనిక ప్రగ్నెన్సీ పై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. మనోజ్ దంపతులు కావాలా పిల్లలకు జన్మనివ్వనున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీని పై మంచు మనోజ్ స్పందించారు. తమకు పుట్టబోయే పిల్లల గురించి వస్తున్న వార్తలను మనోజ్ ఖండించారు. అలాంటి వార్తలను నమ్మొద్దు అని తెలిపాడు. ఈ మేరకు మనోజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు.
తాము కవలలకు జన్మనివ్వనున్నాం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అని అన్నారు. ఏదైనా ఉంటే తానే స్వయంగా తెలుపుతానని.. దయచేసి రూమర్స్ ను నమ్మొద్దు అని తెలిపాడు. ఇక ఈ ఏడాది మే లో మా ఇంటికి రాబోయే బిడ్డకోసం ఎదురుచూస్తున్నం అని పేర్కొన్నారు మంచు మనోజ్. మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపాడు మంచు మనోజ్. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంచు మనోజ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మంచు మనోజ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.