AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reema Sen: ‘మనసంతా నువ్వే’ హీరోయిన్ రీమాసేన్ ఫ్యామిలీని చూశారా ?.. ఎంత పెద్ద కొడుకు ఉన్నాడంటే..

దివంగత హీరో ఉదయ్ కిరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ఉదయ్ సరసన రీమా సేన్ నటించింది. ఇందులో అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది రీమా సేన్. అదే ఏడాదిలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'మిన్నెలే' చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా రంగప్రవేశం చేసింది. తెలుగు , తమిళంలోనే కాకుండా బెంగాలీ, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించింది.

Reema Sen: 'మనసంతా నువ్వే' హీరోయిన్ రీమాసేన్ ఫ్యామిలీని చూశారా ?.. ఎంత పెద్ద కొడుకు ఉన్నాడంటే..
Manasantha Nuvve
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2024 | 12:25 PM

Share

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో ‘మనసంతా నువ్వే’ ఒకటి. అడియన్స్ హృదయాలను హత్తుకున్న మూవీ ఇది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దివంగత హీరో ఉదయ్ కిరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ఉదయ్ సరసన రీమా సేన్ నటించింది. ఇందులో అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది రీమా సేన్. అదే ఏడాదిలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘మిన్నెలే’ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా రంగప్రవేశం చేసింది. తెలుగు , తమిళంలోనే కాకుండా బెంగాలీ, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. 1981 అక్టోబర్ 29న కోల్ కత్తాలో జన్మించిన రీమాసేన్.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనేక ప్రకటనలలో నటించింది.

ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో పలు చిత్రాలు చేసింది. ఆ తర్వాత ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. 2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు రీమాసేన్. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. రీమాసేన్ ఫిబ్రవరి 22, 2013న బాబుకు జన్మనిచ్చారు. తమ కొడుకుకు రుద్రవీర్ అని నామకరణం చేశారు.

View this post on Instagram

A post shared by Reema Sen (@senreema29)

సినిమాలకు పూర్తిగా దూరమైన రీమాసేన్.. అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండరు. ఎప్పుడో ఒకసారి తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం తన ఫ్యామిలీ పిక్ షేర్ చేసింది రీమాసేన్. అందులో తన భర్త, కుమారుడితో కలిసి ఎంతో సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. అయితే రీమాసేన్ కొడుకు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మనసంత నువ్వే హీరోయిన్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. రీమా సేన్ ఫ్యామిలీ ఫోటోస్ మీరు చూసేయ్యండి.

View this post on Instagram

A post shared by Reema Sen (@senreema29)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా..