Premalu Movie Review: ప్రేమలు రివ్యూ.. ఈ వీకెండ్ కు పర్ఫెక్ట్ ఛాయిస్..

ఒకప్పుడు అనువాదం సినిమాలంటే కేవలం తమిళ ఇండస్ట్రీ నుంచి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మలయాళం నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన ప్రేమలు సినిమాని తెలుగులో విడుదల చేశారు రాజమౌళి తనయుడు కార్తికేయ. మరి ఈ సినిమాకు తెలుగులో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

Premalu Movie Review: ప్రేమలు రివ్యూ.. ఈ వీకెండ్ కు పర్ఫెక్ట్ ఛాయిస్..
Premalu Movie
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Mar 08, 2024 | 12:18 PM

మూవీ రివ్యూ: ప్రేమలు

నటీనటులు: నస్లెన్, మామిత బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ అఖిల భార్గవన్, అల్తాఫ్ సలీమ్ తదితరులు

సంగీతం: విష్ణు విజయ్

సినిమాటోగ్రఫీ: అజ్మల్ సాబు

మాటలు: ఆదిత్య హాసన్

నిర్మాతలు: ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గిరీష్ ఏడీ

ఒకప్పుడు అనువాదం సినిమాలంటే కేవలం తమిళ ఇండస్ట్రీ నుంచి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మలయాళం నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన ప్రేమలు సినిమాని తెలుగులో విడుదల చేశారు రాజమౌళి తనయుడు కార్తికేయ. మరి ఈ సినిమాకు తెలుగులో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

సచిన్ (నస్లెన్) చదువులో కాస్త వీక్. ఎలాగోలా కష్టపడి డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత లండన్ వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చి గేట్ కోచింగ్ తీసుకుంటాడు. సచిన్ తో పాటు ఫ్రెండ్ అమూల్ కూడా ఉంటాడు. లైఫ్ అలా సాగిపోతున్న సమయంలో ఒక పెళ్లిలో అనుకోకుండా రీణు (మామిత బైజు)ను చూసి ప్రేమలో పడతాడు. రీణు కూడా సచిన్ తో స్నేహంగానే ఉంటుంది. మరోవైపు రీను ఆఫీసులో పనిచేసే ఆది (శ్యామ్ మోహన్) ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ రాను రాను సచిన్ కే రేణు దగ్గరవుతుంది. ఒకరోజు సచిన్ తన ప్రేమను రీణుకు చెప్తాడు కానీ ఆమె నో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం:

లవ్ స్టోరీస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది.. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. తెలిసిన కథే అయినా ఇంట్రెస్ట్ తగ్గదు. ప్రేమలు సినిమా కూడా ఇదే.. బోర్ కొట్టకుండా అలా సరదాగా వెళ్ళిపోతుంది. ఇది మనం ఎప్పుడూ చూడని కథ కాదు.. మనకు తెలియని కథ కూడా కాదు. ఒక మామూలు సాదాసీదా ప్రేమ కథ. ఆవారా కుర్రాడు, సాఫ్ట్ వేర్ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ. దీన్నే దర్శకుడు గిరీష్ ఎక్కడా బోర్ కొట్టకుండా సూపర్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు. మామూలుగా మలయాళం డబ్బింగ్ సినిమాలు చూసేటప్పుడు నేటివిటీ ఇష్యూ వస్తుంది. ప్రేమలు సినిమాకు ఆ కంప్లైంట్ కూడా లేదు. కథ మొదటి నుంచి చివరి వరకు హైదరాబాద్ లోనే సాగుతుంది కాబట్టి.. ఎక్కడా మనకు అనువాద సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. దానికి తోడు ట్రోలింగ్ లో ఉన్న అన్ని మాటల్ని డైలాగులుగా వాడేసారు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సిట్యుయేషనల్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది.. సెకండాఫ్ అక్కడక్కడ బ్రేకులు పడినట్టు అనిపించిన బోర్ కొట్టదు.

నటీనటులు:

సచిన్ పాత్రలో నెస్లన్ అద్భుతంగా నటించాడు. ఇక సినిమాకు మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ మమిత బైజు. స్క్రీన్ మీద అమ్మాయి సింపుల్ గా మ్యాజిక్ చేసింది. ఈ సినిమా చూశాక తెలుగులో మమితకు అవకాశాలు క్యూ కట్టడం ఖాయం. హీరో ఫ్రెండు పాత్రలో సంగీత్ ప్రతాప్.. హీరోయిన్ కలీగ్ క్యారెక్టర్లో శ్యామ్ మోహన్ సినిమా అంతా బాగా ఎంటర్టైన్ చేశారు. మిగిలిన వాళ్లందరూ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీమ్:

ప్రేమలు సినిమాకు ప్రధానమైన అడ్వాంటేజ్ విష్ణు విజయ్ అందించిన సంగీతం. పాటలు తెలుగులో వినడానికి కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హైదరాబాద్ అందాలను మన తెలుగు సినిమాల కంటే ఎక్కువగా చూపించారు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త స్లో అయింది. ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ డైలాగ్స్. ’90స్ మిడిల్ క్లాస్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ట్రెండీ డైలాగులతో ఇది డబ్బింగ్ సినిమా అనే సంగతే మర్చిపోయాలా చేశాడు. దర్శకుడు గిరీష్ ఏడీ చాలా సింపుల్ కథను అద్భుతమైన స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా ప్రేమలు.. ఈ వీకెండ్ కు పర్ఫెక్ట్ ఛాయిస్..