AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్.. నష్టపరిహారంగా ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్

చాలా మంది షూటింగ్ లో గాయపడ్డారు కూడా. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. స్టంట్, రోప్, డ్యాన్స్, యాక్షన్, పెద్ద పెద్ద సెట్, ఫైర్ ఇలా ఎన్నో డేంజరస్ సెక్షన్లు సెట్‌లో జరుగుతుంటాయి. కాబట్టి సినిమా సెట్‌లో గాయపడే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటీనటులు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్.. నష్టపరిహారంగా ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్
Malayalam Actress
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2024 | 7:15 PM

Share

సినిమా సెట్స్‌లో ప్రమాదాలు జరగడం చాలా కామన్. ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్ షూటింగ్ లో గాయపడ్డారు కూడా.. తాజాగా మాస్ రాజా రవితేజ కూడా షూటింగ్ లో గాయపడ్డారు. ఇలా చాలా మంది షూటింగ్‌లో గాయపడ్డారు కూడా. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. స్టంట్, రోప్, డ్యాన్స్, యాక్షన్, పెద్ద పెద్ద సెట్, ఫైర్ ఇలా ఎన్నో డేంజరస్ సెక్షన్లు సెట్‌లో జరుగుతుంటాయి. కాబట్టి సినిమా సెట్‌లో గాయపడే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటీనటులు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నటులు, నటీమణులు గాయపడినప్పుడు కొద్దిరోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ షూటింగ్‌కి వెళ్తుంటారు. కానీ ఒక్క మలయాళ నటి మాత్రం సెట్స్‌లో గాయపడినందుకు నష్టపరిహారంగా ఏకంగా రూ.5 కోట్లకు కేసు వేసింది.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

ప్రముఖ మలయాళ నటి మంజు వారియవర్‌ పై మలయాళ నటి శీతల్ తంబీ ఫిర్యాదు చేసింది. తన గాయానికి పరిహారంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది ఆమె. శీతల్ తంబీ ‘ఫుటేజ్’ అనే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా యాక్షన్ సీన్ షూటింగ్ లో శీతల్ ప్రమాదంలో గాయపడింది. షూటింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తనకు గాయాలు అయ్యాయని, గాయపడిన రోజు అంబులెన్స్ సర్వీస్ కూడా ఇవ్వలేదని శీతల్ ఆరోపించింది.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

గాయం కారణంగా తన సినీ కెరీర్ లో సమస్య వచ్చిందని, ఇకపై నేను నటించలేకపోవచ్చునని, అందుకే పరిహారంగా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ‘ఫుటేజ్’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న నటి మంజు వారియర్ పేరు కూడా ఫిర్యాదులో చేర్చింది ఆమె అలాగే రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మంజు వారియర్ మలయాళ సినిమాల్లో ప్రముఖ నటి. నటనలో జాతీయ అవార్డు గెలుచుకున్నారు మంజు వారియర్. 1995 నుండి మలయాళ చిత్ర పరిశ్రమలో నటిస్తున్న మంజు వారియర్ మలయాళంలోనే కాకుండా కొన్ని తమిళ చిత్రాలలో కూడా నటించింది. ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమాలో ధనుష్ భార్యగా నటించింది. గతేడాది విడుదలైన అజిత్ నటించిన ‘తునీవు’లో ఆమె నటించింది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ‘మిస్టర్ ఎక్స్’, ‘విడుదలై పార్ట్ 2′, రజనీకాంత్  నటిస్తున్న వేటయన్’ చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు మోహన్‌లాల్‌ ‘లూసిఫర్‌ 2’ చిత్రంలో కూడా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.