AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 12 ఏళ్ల కూతురును పక్కన పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. వీడియో వైరల్

పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార యాంకర్ గా బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెండోసారి పెళ్లిపీటలెక్కింది. అది కూడా తన 12 ఏళ్ల కూతురును పక్కన పెట్టుకుని..

Tollywood: 12 ఏళ్ల కూతురును పక్కన పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. వీడియో వైరల్
Malayalam Actress Arya Marriage
Basha Shek
|

Updated on: Aug 22, 2025 | 10:16 PM

Share

తల్లీ కానీ, తండ్రి కానీ రెండో పెళ్లి చేసుకుంటానంటే చాలా మంది పిల్లలు అంగీకరించరు. కానీ ఈ ప్రముఖ నటి పెళ్లికి తన 12 ఏళ్ల కూతురు తోడుగా నిలిచింది. స్వయంగా తల్లిని పెళ్లి మండపానికి తీసుకొచ్చింది. ఇక తల్లి మెడలో మూడుముళ్లు పడుతున్నప్పుడు ఆ కూతురు ముఖంలో ఆనందం చూడాలి.. నెక్ట్స్ లెవెల్ అంతే. ఇలా 12 ఏళ్ల కూతురును పక్కన పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్న యాంకర్ కమ్ నటి పేరు ఆర్య. మలయాళంలో ఫేమస్ నటిగా వెలుగొందుతోన్న ఆమెనటుడు, కొరియోగ్రాఫర్‌ సిబిన్‌ బెంజమిన్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. ఇది ఇద్దరికీ రెండో వివాహమే. ఈ ఏడాది మేలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్య- సిబిన్. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్‌ ఖుషి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పెళ్లి వేడుకలో భాగంగా తన తల్లిని మండపం వరకు తీసుకొచ్చింది. అలాగే తల్లి మెడలో మూడు ముళ్లు పడుతుంటే సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఈ ఫొటోలను చూసి ప్రియ మణి, పూర్ణ, అశ్వతి శ్రీకాంత్, అర్చన సుశీలన్ తదితర ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు

మలయాళ నటి ఆర్య పెళ్లి వీడియో..

View this post on Instagram

A post shared by Arya Babu (@arya.badai)

కుంజిరమయనం, పవ, ఉల్టా, మెప్పడియాన్‌, క్వీన్‌ ఎలిజబెత్‌  తదితర  సూపర్ హిట్ మలయాళ  సినిమాల్లో నటించింది ఆర్య.  అలాగే బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గానూ రాణిస్తోందీ అందాల తార.  మలయాళ బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లోనూ పాల్గొంది.  ప్రముఖ నటి అర్చన సోదరుడు, ఐటీ ఇంజనీర్‌ రోహిత్‌ సుశీలన్‌ను ఆర్య పెళ్లాడింది. వీరికి రోయ అనే కూతురు పుట్టింది. అయితే 2019లో భర్త నుంచి విడిపోయినట్లు ఆర్య ప్రకటించింది. డీజే సిబిన్‌.. మలయాళ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇతనికి కూడా గతంలో పెళ్లయి పిల్లలున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు