Shyam Singha Roy: “శ్యామ్ సింగరాయ్” నుంచి అదిరిపోయే అప్డేట్.. రైజ్ ఆఫ్ శ్యామ్‌తో రానున్న నాని
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి.. మడోనా సెబాస్టియన్.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై ఆసక్తిని పెంచాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా పై నమ్మకంగా ఉంది చిత్రయూనిట్. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమానుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. దీపావళి సంధర్భంగా ఈ సినిమానుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 6న ఈ సినిమానుంచి సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈమేరకు నాని సూపర్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో నాని రాయల్ లుక్ లో కనిపించాడు. ఈ పోస్టర్ పై మీరు ఓ లుక్కేయండి.
This November ????? will Take Over the Fireworks ?#ShyamSinghaRoy ? First Lyrical #RISEOFSHYAM ? on 6th NOV ⌛
A @MickeyJMeyer Musical ?
Natural ?@NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @Rahul_Sankrityn @vboyanapalli @NiharikaEnt @saregamasouth #SSRonDEC24th pic.twitter.com/HE8wi0BcRe
— BA Raju’s Team (@baraju_SuperHit) October 30, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :