ప్రపంచస్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రం సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అంతేకాకుండా ఎన్నో అవార్డ్స్ అందుకుంది. ముఖ్యంగా సినీరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ కైవలం చేసుకుని అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించింది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగణ్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. సినిమానే కాకుండా ఈ చిత్రంలోని పాటలు కూడా సెన్సెషన్ క్రియేట్ చేశాయి. విశ్వవేదికగా ఎన్నో అవార్డ్స్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తయ్యింది.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సీనిప్రియులు. ఈ క్రమంలోనే అభిమానులకు స్పెషల్ సర్పైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. ట్రిపుల్ ఆర్ సెట్స్ నుంచి తారక్, రామ్ చరణ్, జక్కన్న ముగ్గురూ సైకిల్స్ పై వెళ్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది చిత్రయూనిట్. అందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ భీమ్ లుక్ లో కనిపించారు. ఈ త్రోబ్యాక్ ఫోటో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి మరికొన్ని ఫోటోస్ రిలీజ్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాతో గ్లోబల్ స్టార్స్ గా ఇమేజ్ సంపాదించుకున్న చరణ్, తారక్.. ప్రస్తుతం తమ తదుపరి చిత్రాలతో బిజీగా అయ్యారు. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం చరణ్ ఆర్సీ 15 సినిమా చేస్తుండగా.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తాను చేయాల్సిన ప్రాజెక్ట్స్ పనులు చూసుకుంటున్నారు జక్కన్న.
The RRRIDE…. ??? #RRRMovie pic.twitter.com/owGiUJP353
— RRR Movie (@RRRMovie) March 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.