Vijay Sethupathi : యంగ్ హీరో సినిమాలో విలన్‌గా మక్కల్ సెల్వన్..? క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్
ఈ మధ్య కాలంలో హీరో రోల్స్ తో పాటుగా విలన్ రోల్స్ కూడా బాగా క్లిక్ అవుతున్నాయి. హీరో పాత్ర కంటే విలన్ మాత్రం పవర్ ఫుల్ గా ఉండేలా చూసుకుంటున్నారు కొందరు దర్శకులు.
ఈ మధ్య కాలంలో హీరో రోల్స్ తో పాటుగా విలన్ రోల్స్ కూడా బాగా క్లిక్ అవుతున్నాయి. హీరో పాత్ర కంటే విలన్ మాత్రం పవర్ ఫుల్ గా ఉండేలా చూసుకుంటున్నారు కొందరు దర్శకులు. దాంతో చాలా మంది నటులు విలన్ పత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మన హీరోలు కూడా ఛాన్స్ దొరికితే విలన్ గా మెప్పిస్తామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం విలన్ గా రాణిస్తున్న నటుల్లో బెస్ట్ ఎవరంటే టక్కున చెప్పే పేరు విజయ్ సేతుపతి(Vijay Sethupathi ). ఓ వైపు హీరోగా మెప్పిస్తూనే.. మరో వైపు విలన్ గా అదరగొడుతున్నారు. తెలుగులో ఉప్పెన సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి అదరగొట్టాడు విజయ్ సేతుపతి. ఆతర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్, రీసెంట్ గా వచ్చిన విక్రమ్ సినిమాల్లో సేతుపతి తన సత్తా చాటాడు.
తాజాగా విజయ్ సేతుపతి ఓ యంగ్ హీరో సినిమాలో విలన్ గా నటిస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా శివకార్తికేయన్ సుపరిచితుడే.. శివ నటించిన రెమో సినిమా తెలుగులో డబ్ అయ్యి మంచి టాక్ ను సొంతంచేసుకుంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు డబ్ అయ్యి ఇక్కడ సక్సెస్ అయ్యాయి. త్వరలో ఈ యంగ్ హీరో జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రిన్స్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా తర్వాత మావీరన్ అనే సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నారని టాక్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. అయితే విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం లేదని తెలిసి శివకార్తికేయన్ ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారట. ఆయన విలన్ గా చేసి ఉంటే సినిమాకు మైలేజ్ పెరిగేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి