Pawan Kalyan-Mahesh Babu: పవన్ సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ మిస్ అవ్వడానికి కారణం అదేనట.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరు హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ లో వారు సినిమాలు చేస్తూ భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ఈ ఇద్దరు హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్‌లో వారు సినిమాలు చేస్తూ భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. నా ప్రెండ్ సంజయ్ సాహు అంటూ మహేష్ పవన్ ను పరిచయం చేయడం ఇద్దరి అభిమానుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపింది. అప్పటి నుంచి పవన్, మహేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో మహేష్ చిన్న పాత్రలో నటించాల్సి ఉందట కానీ అది మిస్ అయ్యిందట.
పవర్ స్టార్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత పవన్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక క్యామియో చేయాల్సి ఉన్నదట.. సినిమా క్లైమాక్స్ లో సమంత ఇంటినుంచి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో విలన్ ఆమె కారు పై దాడి చేయించి ఆమెను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఖలేజా సినిమాలోని మహేష్ టాక్సీ డ్రైవర్ రాజు పాత్ర ఎంటర్ అయ్యి సామ్ ను కాపాడేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఇదే విషయం మహేష్ బాబుకు చెప్తే.. కథ మంచి ఫ్లోలో ఉన్న సమయంలో గెస్ట్ రోల్ వస్తే కథ సైడ్ ట్రాక్ అవుతుంది. గెస్ట్ రోల్ ఎందుకు మంచి కథను సిద్ధం చేయండి మల్టీస్టారర్ సినిమా చేద్దాం అని మహేష్ అన్నారట. అదే ఆ సినిమాలో మహేష్ బాబు నిజంగానే ఎంట్రీ ఇచ్చి ఉంటే ఫ్యాన్స్ ఇంకా థ్రిల్ అయ్యేవారు. మరి ఇప్పటికైనా మహేష్ , పవన్ తో గురూజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.