Taapsee Pannu: ఫ్లాపులొచ్చినా తగ్గేదే లే అంటున్న తాప్సీ.. అమ్మడి చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను బాగా వాడుకుంటోంది అందాల భామ తాప్సీ. తెలుగులో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా బాలీవుడ్ లో మాత్రం బాగానే నెట్టుకొస్తోంది ఈ చిన్నది
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను బాగా వాడుకుంటోంది అందాల భామ తాప్సీ(Taapsee Pannu). తెలుగులో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా బాలీవుడ్ లో మాత్రం బాగానే నెట్టుకొస్తోంది ఈ చిన్నది. తెలుగు రాఘవేంద్రరావు లాంటి లెజెండ్ డైరెక్షన్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకోలేక పోయింది. మొదటి సినిమా పర్లేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా హిట్టు కొట్టినా ఆ క్రేజ్ అంతా ప్రభాస్ , కాజల్ కు వెళ్లిపోయింది. దాంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటీ. అక్కడ ఉన్న పోటీని తట్టుకోవడనికి లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కరెక్ట్ అని వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కథ కొత్తగా ఉంటే చాలు సినిమాలు ఓకే చేస్తుంది తాప్సీ.
లాడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్ ఈ అమ్మడు తన ముద్ర వేసిందనే చెప్పాలి. ఇక కంగనా లాంటి ఫైర్ బ్రాండ్ లతో వివాదాలు పెట్టుకొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. బాలీవుడ్ సినిమాలతో పాటు అడపాదడపా సౌత్ సినిమాల్లోనూ నటిస్తుంది తాప్సీ.. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా వచ్చిన శబాష్ మిదు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టులోకపోయింది. అంతకు ముందు తెలుగులో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా కూడా నిరాశపరిచింది. అలాగే లూప్ లా పేట్, రష్మీ రాకెట్, అనీబెల్లా సేతుపతి ఇలా వరుసగా సినిమాలు ఫ్లాప్ బాటపట్టాయి. ఇవన్నీ ఓటీటీ వేదిక రిలీజ్ అయిన ఈ సినిమాలన్నీ బోల్తాకొట్టాయి. అయినా కూడా ఈ తాప్సీ సినిమాలకు కొదవే లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ‘బ్లర్’, ‘ఓ లడికీ కహా హై’, డుంకీ, ‘దొబరా’. తమిళ్ లో ‘ఏలియన్’, ‘జనగణమన’ సినిమాలు ఉన్నాయి. ఇలా ఫ్లాపులొచ్చినా తాప్సీ మాత్రం రాకెట్ లా దూసుకుపోతోంది.