Gautam Ghattamaneni: గౌతమ్ ఘట్టమనేని స్టేజ్ పర్ఫామెన్స్.. యాక్టింగ్‌లో ఏమాత్రం తగ్గట్లే.. జూ. మహేశ్
సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రతల కూతురు సితార చేసే అల్లరి అంతా ఇంత కాదు. నిత్యం ఏదో ఒక యాక్టివిటీతో సందడి చేస్తుంటుంది. అయితే సితారతో పోలిస్తే గౌతం కొంచెం కామ్ అండ్ కూల్. కానీ యాక్టింగ్‌లో అయితే మాత్రం కాదు. ఎందుకంటే...
మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అచ్చం తండ్రి రూపురేఖలతో అట్రాక్ట్ చేస్తుంటారు గౌతమ్. తాజాగా ఆయనలోని ఓ టాలెంట్ బయటపడింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా స్కూల్‌లో జరిగిన థియేటర్ ప్రదర్శనలో కథానాయకుడిగా సందడి చేశారు. స్నేహితులతో కలిసి స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ తన నటనా ప్రతిభను చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ గౌతమ్ టాలెంట్ పై ప్రశంసలు గుప్పించింది నమ్రత. ఈ వీడియోలో గౌతమ్ గెటప్ కొత్తగా, వింతగా కూడా ఉంది.
గౌతమ్‌ని అలా చూసిన నెటిజన్లు అచ్చం మహేశ్ బాబులా ఉన్నాడంటూ కామెంట్లు వదులుతున్నారు. మహేశ్ బాబు లుక్స్ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని, మరో తరానికి కాబోతున్న టాప్ స్టార్ హీరో అని పొగుడుతున్నారు. గతంలో మహేష్ బాబు- సుకుమార్ కాంబోలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు గౌతమ్. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకు గౌతమ్‌ను స్క్రీన్ మీద కనిపించలేదు.
ఇక ఈ వీడియోను పోస్టు చేసిన నమ్రత.. గౌతమ్ లవ్వులో పెద్ద ఎక్స్‌పర్ట్ ఏమీ కాదు..కానీ అతని ఫ్రెండ్స్ మాత్రం అందులో ఆరితేరిపోయారు. హై స్కూల్లో గౌతమ్ మొదటి సారిగా ఇలా స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. గౌతమ్ తన స్టైల్లో అదరగొట్టేశాడు.. ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాలి మై బాయ్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. లవ్యూ సో మచ్ అంటూ గౌతమ్ గురించి చెబుతూ నమ్రత మురిసిపోయింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.