Varanasi Movie: మహేష్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వారణాసి సినిమా షూటింగ్‌కు బ్రేక్.. కారణమిదే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా వారణాసి. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా టైటిల్ ఇటీవలే లాంచ్ అయింది. దీంతో ఈ సినిమాపై హైప్ బాగా క్రియేట్ అయ్యింది. దీనికి తోడు రాజమౌళి- మహేష్ కాంబో కాబట్టి సహజంగానే ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా రాజమౌళి సినిమా అంటే కనీసం 2, 3 ఏళ్లు పడుతుంది. సినిమాలో ప్రతీది పర్ఫెక్ట్ గా రావాలనుకుంటాడు జక్కన్న. అందుకే తన సినిమాల కోసం చాలా టైమ్ తీసుకుంటాడు. అయితే వారణాసి సినిమా విషయంలో అలాంటిదేమీ జరగదని ఇటీవల నిర్మాత చెప్పుకొచ్చడు. అయితే ఇప్పుడు ‘వారణాసి’ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఏర్పడింది. దీనికి కారణం మహేష్ బాబు. తన సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా, తన కుటుంబానికి సమయం ఇవ్వడంలో ఎప్పుడూ మిస్ అవ్వడు మహేష్. సినిమా పనుల నుంచి విరామం తీసుకుని, తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతుంటాడీ సూపర్ స్టార్. ఇప్పటికే ‘వారణాసి’ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ బాబు, తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.
గతంలో ‘వారణాసి’ సినిమా పని ప్రారంభించే ముందు, రాజమౌళి ఒక పోస్ట్ పెట్టాడు. తన దగ్గర మహేష్ బాబు పాస్‌పోర్ట్ ఉందని చెబుతూ ఒక ఫొటో షేర్ చేశాడు. తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లే మహేష్ బాబును తాను అరెస్టు చేసినట్లుగా పోజు ఇచ్చాడు. అయితే మహేష్ బాబు ఇప్పుడు తన భార్య, పిల్లలతో విదేశీ పర్యటనకు వెళ్లకుండా ఎవరూ ఆపలేకపోయారు. ప్రస్తుతానికి, అతను ‘వారణాసి’ సినిమా షూటింగ్ నుంచి విరామం తీసుకున్నాడు. అతను తిరిగి వచ్చిన తర్వాతే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
‘RRR’ విజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. కాబట్టి ‘వారణాసి’ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కూడా వివాదానికి కారణమవుతోంది. దర్శకుడు సి.హెచ్. సుబ్బారెడ్డి ‘వారణాసి’ అనే టైటిల్‌ను రెండేళ్ల క్రితమే రిజిస్టర్ చేయించుకున్నట్లు చెప్పారు. కాబట్టి రాజమౌళి ఈ టైటిల్‌లో స్వల్ప మార్పు చేసే అవకాశం ఉంది. టైటిల్‌ను ‘రాజమౌళి వారణాసి’గా మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








