మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్ సార్!

‘మహర్షి’ ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనే మూవీ చేస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. చిత్రంలోని మహేష్ బాబు పాత్ర పేరు తాజాగా రివీల్ చేసారు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో ఆయన నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే కాశ్మీర్‌లో మూవీ షూటింగ్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:04 pm, Wed, 10 July 19
మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్ సార్!

‘మహర్షి’ ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనే మూవీ చేస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు.

చిత్రంలోని మహేష్ బాబు పాత్ర పేరు తాజాగా రివీల్ చేసారు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో ఆయన నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే కాశ్మీర్‌లో మూవీ షూటింగ్ మొదలైంది. ‘పోకిరి’లో కృష్ణ మనోహర్’ ఐపీఎస్‌గా కనిపించిన మహేష్ బాబు.. ‘దూకుడు’లో అజయ్ కుమార్ ఐపీఎస్‌గా నటించాడు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’లో పోకిరిలో కృష్ణ, దూకుడులో అజయ్ కలిపి మేజర్ ‘అజయ్ కృష్ణ’గా అలరించనున్నాడు.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోండగా.. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కాగా ఈ మూవీతో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది.