Mahesh Babu: ‘పెద్దోడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుంది’.. మహేష్ బాబు ఆసక్తికర పోస్ట్..
కెరియర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్న వీరిద్దరు.. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అలరించారు. ఇందులో అన్నదమ్ముళ్లు చిన్నోడు, పెద్దోడుగా కనిపించారు. అప్పట్లో వీరి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. స్క్రీన్ పై అన్నదమ్ముల్లుగా మంచి బాండింగ్ తో కనిపించిన వీరిద్దరూ బయట కూడా అదే బంధంతో కనిపిస్తుంటారు. తాజాగా ఇద్దరూ ఒక ప్రైవేట్ పార్టీలో కనిపించారు. ఇద్దరు కలిసి సందడి చేశారు. అలాగే ఓ టేబుల్ వద్ద కూర్చుని కార్డ్స్ ఆడుతూ కనిపించారు.

ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అటు సైంధవ్ సినిమాతో వెంకీ సైతం క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. కెరియర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్న వీరిద్దరు.. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అలరించారు. ఇందులో అన్నదమ్ముళ్లు చిన్నోడు, పెద్దోడుగా కనిపించారు. అప్పట్లో వీరి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. స్క్రీన్ పై అన్నదమ్ముల్లుగా మంచి బాండింగ్ తో కనిపించిన వీరిద్దరూ బయట కూడా అదే బంధంతో కనిపిస్తుంటారు. తాజాగా ఇద్దరూ ఒక ప్రైవేట్ పార్టీలో కనిపించారు. ఇద్దరు కలిసి సందడి చేశారు. అలాగే ఓ టేబుల్ వద్ద కూర్చుని కార్డ్స్ ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా మహేష్ సైతం తన ఇన్ స్టా స్టోరీలో ఆసక్తికర పోస్ట్ చేశారు.
వెంకటేశ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “పెద్దోడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుంది” అంటూ రాసుకొచ్చాడు మహేష్. అందులో వెంకీ, మహేష్ ఇద్దరూ స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి కాంబోలో మళ్లీ ఇంకో సినిమా వస్తే చూడాలని ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ . ఈ ఇద్దరి కాంబో మళ్లీ సెట్ అవుతుందో లేదో చూడాలి.

Mahesh, Venky
View this post on Instagram
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. ఇక సైంధవ్ సైతం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
The highly Inflammable Superstar 🌟 @urstrulyMahesh is here to IGNITE the screens with a MASS BLAST! 💥🔥#GunturKaaaram First single #DumMasala Promo Out Now – https://t.co/KF1FE19RNE
A @MusicThaman Musical 🎹🥁 ✍️ @ramjowrites 🎤 #SanjithHegde
Full Song out on Nov 7th! 🌶…
— Haarika & Hassine Creations (@haarikahassine) November 5, 2023
#DumMasala… Coming to you soon!! 🔥https://t.co/TbFQwJNmaN#Trivikram @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @MusicThaman @ramjowrites #SanjithHegde @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th
— Mahesh Babu (@urstrulyMahesh) November 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




