Film News: గుంటూరు కారం నుంచి క్రేజీ అప్డేట్.. శరవేగంగా జరుగుతున్న కన్నప్ప చిత్రీకరణ..

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చింది. 48 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసి రికార్డ్ సృష్టించిన మలైకా అరోరాను మధుబాల బీట్ చేసారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు భక్త కన్నప్ప షూటింగ్ వేగంగా జరుగుతుంది. రాఘవా లారెన్స్‌, ఎస్‌జే సూర్య లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్‌‌తాండ డబుల్ ఎక్స్. కార్తీక్‌ రాజు హీరోగా క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో మహేష్‌రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా అథర్వ.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Nov 06, 2023 | 9:30 AM

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను నవంబర్ 5 ఉదయం 11.07 గంటలకు విడుదల చేసారు. ఈ క్రమంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేసారు. ఫుల్ సాంగ్ నవంబర్ 7న విడుదల కానుంది.

1 / 5
48 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసి రికార్డ్ సృష్టించిన మలైకా అరోరాను మధుబాల బీట్ చేసారు. ఆమె ఏకంగా 54 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసి ఆశ్చర్యపరిచారు. గగనతలంలో 12వేల అడుగుల ఎత్తు నుంచి దూకారు. న్యూజిలాండ్‌లోని ఫేమస్ టాపో టాండెం స్కై డైవింగ్ సెంటర్‌లో మధుబాల నవంబర్ 1వ తేదీన ఈ స్కై డైవింగ్ చేశారు. ఆమెతో పాటు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ విజేత కౌశల్ మండ కూడా స్కై డైవింగ్ చేశారు.

2 / 5
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు భక్త కన్నప్ప షూటింగ్ వేగంగా జరుగుతుంది. న్యూజిలాండ్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతుంది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. కన్నప్ప కోసం అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెచా’ వర్క్ చేయబోతున్నారు. బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలకు ఈయన వర్క్ చేసారు.

3 / 5
రాఘవా లారెన్స్‌, ఎస్‌జే సూర్య లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్‌‌తాండ డబుల్ ఎక్స్. 2014లో యాక్షన్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రిలీజై త‌మిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్‌తండ చిత్రానికి డబుల్ ఎక్స్ సీక్వెల్‌గా వస్తోంది. నవంబర్ 10న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చారు. నానక్‌రామ్ గూడలోని ప్రధాన్ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరిగింది.

4 / 5
Atharva ott

Atharva ott

5 / 5
Follow us