Mahesh Babu AN Restaurant: గ్రాండ్‌గా ‘ఏఎన్’ రెస్టారెంట్‌ లాంచ్.. డిజైన్, ఫర్నీచర్ లుక్ అద్దిరిపోయింది..

Mahesh Babu AN Restaurant: మహేష్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు వ్యాపార రంగంలోను దూసుకుపోతున్నాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే బిజినెస్‌మ్యాన్‌గానూ బిజీ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్‌ బాబు.

Mahesh Babu AN Restaurant: గ్రాండ్‌గా ‘ఏఎన్’ రెస్టారెంట్‌ లాంచ్.. డిజైన్, ఫర్నీచర్ లుక్ అద్దిరిపోయింది..
An Restaurant
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 08, 2022 | 9:23 AM

మహేష్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు వ్యాపార రంగంలోను దూసుకుపోతున్నాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే బిజినెస్‌మ్యాన్‌గానూ బిజీ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్‌ బాబు. ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్‌లో రాణిస్తున్న మహేష్.. ఇప్పుడు ఆయన భార్య నమ్రతచే రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టించారు. ఏసియన్ గ్రూప్‌తో కలిసి థియేటర్‌ చైన్ స్టార్ట్ చేసిన మహేష్.. తాజాగా అదే గ్రూప్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను గురువారం నాడు ప్రారంభించారు.

ఈ రెస్టారెంట్‌కు ‘ఏఎన్’ అని నామకరణం చేశారు. ఏ అంటే ఏషియన్స్ అండ్ ఎన్ అంటే నమ్రత. AN రెస్టారెంట్స్ పేరుతో హైదరాబాద్‌లో మినార్వా కాఫీ హైట్స్ ఆఫ్ ప్లేసెస్ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టారు. బుధవారం నాడు నమ్రత, ఎషియన్ సునీల్ సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి, ఇవాళ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇప్పటికే ఎషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో కలిసి మహేశ్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు. తాజాగా ఆయన భార్యకూడ ఏషియన్ వాళ్ళతో కలిసి కొత్త వ్యాపారం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇక రెస్టారెంట్ లోపల లుక్ అదిరింది.. డిజైనింగ్, ఫర్నిచర్ సూపర్, ఫైవ్ స్టార్ హోటల్‌ని తలపించేలా ఉంది. ఈ హోటల్ బిజినెస్ కూడా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

నమ్రత షేర్ చేసిన ఫోటోలు..

మరిన్ని ఎంటర్నైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..