Tollywood: సంక్రాంతికి థియేటర్లలో మాస్‌ జాతర.. ఫ్యాన్స్‌కు పూనకాలే. కానీ ఆ ఒక్కటే అసలు సమస్య..

కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖ పట్టడంతో మళ్లీ సినిమా రంగానికి పూర్వ వైభవం వస్తోంది. ఈ మధ్య వచ్చిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను నమోదు చేసుకోవడంతో టాలీవుడ్‌కు సరికొత్త ఊపును తీసుకొచ్చాయి. కరోనా తర్వాత మళ్లీ ప్రేక్షకులకు థియేటర్లకు క్యూ కట్టిచ్చాయి...

Tollywood: సంక్రాంతికి థియేటర్లలో మాస్‌ జాతర.. ఫ్యాన్స్‌కు పూనకాలే. కానీ ఆ ఒక్కటే అసలు సమస్య..
Tollywood
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Dec 12, 2022 | 3:15 PM

కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖ పట్టడంతో మళ్లీ సినిమా రంగానికి పూర్వ వైభవం వస్తోంది. ఈ మధ్య వచ్చిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను నమోదు చేసుకోవడంతో టాలీవుడ్‌కు సరికొత్త ఊపును తీసుకొచ్చాయి. కరోనా తర్వాత మళ్లీ ప్రేక్షకులకు థియేటర్లకు క్యూ కట్టిచ్చాయి. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి సంక్రాంతి సీజన్‌పై పడింది. సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌కు సెంటిమెంట్‌ అనే విషయం తెలిసిందే. బడా స్టార్ హీరోలు సంక్రాంతి బరిలోకి దిగుతుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి థియేటర్లలో మాస్‌ జాతర పక్కాగా ఉండేలా కనిపిస్తోంది.

ఇప్పటికే బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’, చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు టాప్‌ హీరోలు బరిలోకి దిగనున్నారు. ‘వీర సింహారెడ్డి’ జనవరి 12న, ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇదిలా ఉంటే విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న వారసుడు కూడా సంక్రాంతి బరిలో దిగనున్నాడు. విజయ్‌కి తెలుగులో మార్కెట్‌ ఉండడం, ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించడంతో సహజంగానే భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక సంక్రాంతి బరిలోకి దిగుతోన్న మరో సినిమా అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘తునీవు’. తెలుగులో ‘తెగింపు’ అనే టైటిల్‌తో విడుదల కానుంది.

అజిత్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉండడం, ఇప్పటికే సినిమా టీజర్‌.. ఫస్ట్‌లుక్‌లు ఆసక్తికరంగా ఉండడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సంక్రాంతిక్‌ థియేటర్లలో మాస్‌ జాతర పక్కా అని ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కేవలం ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు భారీ చిత్రాలు వస్తుండడం విశేషం. ఇదంతా బాగానే ఉన్నా థియేటర్ల విషయంలోనే గందరగోళం నెలకొంది. ఒకేసారి నాలుగు భారీ చిత్రాలు వస్తుండడంతో థియేటర్లు అడ్జస్ట్‌ ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయంలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటన చేసిన విషం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తమిళ ప్రొడ్యూసర్స్ తప్పుపట్టారు. దీంతో ఈ సంక్రాంతికి థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉందని బహిరంగానే చర్చ జరుగుతోంది. మరి ఏం జరగనుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..