AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Year in Search 2022: గూగుల్‌లో సత్తా చాటిన సౌత్ సినిమాలు.. బాలీవుడ్ నుంచి నాలుగే.. లిస్టులో టాప్ ప్లేస్ ఏదంటే?

ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన భారతీయ సినిమాలను గూగుల్ ప్రకటించింది. ఈ జాబితాలోని 10 చిత్రాలలో కేవలం నాలుగు మాత్రమే బాలీవుడ్ నుంచి చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఓ హాలీవుడ్ చిత్రం కూడా ఉంది.

Google Year in Search 2022: గూగుల్‌లో సత్తా చాటిన సౌత్ సినిమాలు.. బాలీవుడ్ నుంచి నాలుగే.. లిస్టులో టాప్ ప్లేస్ ఏదంటే?
Most Googled Indian Film 2022
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 08, 2022 | 7:45 AM

Share

Most Googled Indian Film 2022: గూగుల్ సెర్చ్ రిపోర్ట్ ప్రకారం, భారతీయ చిత్రాలలో ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. దీనితో పాటు KGF చాప్టర్ 2, ది కాశ్మీర్ ఫైల్స్, RRR, కాంతారా ఉన్నాయి. ఈ మేరకు గూగుల్ 2022లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల పేర్లను ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టాప్‌లో బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ 2022..

శివ అయాన్ ముఖర్జీ నిర్మించిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ అత్యధికంగా గూగుల్‌లో వెతికిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోవడం గమనార్హం. అలాగే KGF చాప్టర్ 2, RRR, కాంతారా, ది కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాలు బ్రహ్మస్త్ర తర్వాతే నిలిచాయి. బ్రహ్మాస్త్ర చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా KGF చాప్టర్ 2 నిలిచింది. మరోవైపు, ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన భారతీయ చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 2 రెండో స్థానంలో నిలిచింది. వివేక్ అగ్నిహోత్రి నిర్మించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూడవ స్థానంలో ఉంది. ఇక తెలుగు సినిమా RRR నాలుగో స్థానంలో ఉంది. కాంతారా సినిమా ఐదో స్థానంలో ఉంది. కమల్ హాసన్ పునరాగమనం చేసిన విక్రమ్ సినిమా ఏడో స్థానంలో నిలిచింది. కాగా, పుష్ప ది రైజ్ ఆరో స్థానంలో ఉంది. విశేషమేమిటంటే.. కేవలం నాలుగు బాలీవుడ్ చిత్రాలే టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి. వీటిలో బ్రహ్మాస్త్ర, ది కాశ్మీర్ ఫైల్స్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అజయ్ దేవగన్ దృశ్యం 2 ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

హాలీవుడ్ చిత్రం మార్వెల్: థోర్ లవ్ అండ్ థండర్ 10వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా వసూళ్ల పరంగా ఇతర హాలీవుడ్ చిత్రాల కంటే వెనుకబడింది. విశేషమేమిటంటే, గతేడాది సూర్య నటించిన జై భీమ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

1) బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ

2) KGF చాప్టర్ 2

3) కాశ్మీర్ ఫైల్స్

4) RRR

5) కాంతారా

6) పుష్ప: ది రైజ్

7) విక్రమ్

8) లాల్ సింగ్ చద్దా

9) దృశ్యం 2

10) థోర్: లవ్ అండ్ థండర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..