Urusu Celebrations: ఘనంగా అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు.. గంధం మహోత్సవంలో ఏఆర్ రెహమాన్
450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు తెలంగాణ, కర్ణాటక , తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. సెలబ్రెటీలు సందడి చేస్తారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధం మహోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరై స్వామి వారి గంధం మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతి ఫకీర్ల విన్యాసాల నడుమ తన శిష్యగణం తో వచ్చి దర్గాలోని మజార్ల వద్ద, గంధం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు పీఠాధిపతి అరిపుల్ల హుస్సేని చేశారు. పెద్ద దర్గా ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. ఉరుసు ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోటి రూపాయలను దర్గా నిర్వాహకులకు అందజేసింది.
450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు తెలంగాణ, కర్ణాటక , తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. సెలబ్రెటీలు సందడి చేస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. ప్రత్యేక వసతులను కల్పించింది.
భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్గా ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఈవ్ టీజింగ్, దొంగతనాలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
REPORTER: SUDHIR , Tv 9, Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..