Gold Silver Rate Today: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్.. భారీగా పెరిగిన ధర. తులంపై ఎంత పెరిగిందంటే..
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు బుధవారం ఒక్కరోజు కాస్త బ్రేక్ పడినట్లు కనిపించింది. డిసెంబర్ 7వ తేదీన 10 గ్రాముల బంగారం ధరపై సుమారు రూ. 300 వరకు తగ్గింది. అయితే తాజాగా మళ్లీ గోల్డ్ రేట్ పెరిగింది. గురువారం దేశంలోని దాదాపు..
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు బుధవారం ఒక్కరోజు కాస్త బ్రేక్ పడినట్లు కనిపించింది. డిసెంబర్ 7వ తేదీన 10 గ్రాముల బంగారం ధరపై సుమారు రూ. 300 వరకు తగ్గింది. అయితే తాజాగా మళ్లీ గోల్డ్ రేట్ పెరిగింది. గురువారం దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల గోల్డ్‌పై ఏకంగా రూ. 200 వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,150 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 49,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 54,000 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 50,160 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 54,720 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,050 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 49,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,000 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 49,500 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 54,000 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 54,000 గా ఉంది.
వెండి ధరలు ఇలా ఉన్నాయి..
ఓవైపు బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే మరోవైపు వెండి ధరలో మాత్రం తగ్గుదల నమోదైంది. వరుసగా మూడో రోజు కూడా వెండి ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో గురువారం కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,500 , ముంబైలో రూ. 65,500 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ మాత్రం వెండి ధరలో పెరుగుదల కనిపంచింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 71,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..