UPI Payment: యూపీఐ ద్వారా ఒక్క రోజులో ఎంత పంపించుకోవచ్చు.. గంటలో ఎన్ని ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చో తెలుసా?

ప్రస్తుతం ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ భారీగా పెరిగాయి. ప్రతీ చిన్న అవసరానికి యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్న రోజులివీ. దీంతో చాలా కంపెనీలు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే, అమెజాన్‌ పే వంటి ఎన్నో యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి...

UPI Payment: యూపీఐ ద్వారా ఒక్క రోజులో ఎంత పంపించుకోవచ్చు.. గంటలో ఎన్ని ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చో తెలుసా?
Upi Payments
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 08, 2022 | 7:19 AM

ప్రస్తుతం ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ భారీగా పెరిగాయి. ప్రతీ చిన్న అవసరానికి యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్న రోజులివీ. దీంతో చాలా కంపెనీలు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే, అమెజాన్‌ పే వంటి ఎన్నో యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ విషయంలోనూ కొన్ని పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా.? యూపీఐ సేవలు అందించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ట్రాన్సాక్షన్స్‌ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది.

ఈ నిబంధనల ప్రకారం.. యూపీఐ ద్వారా ఒక యూజర్‌ రోజులో రూ. లక్ష వరకే పంపుకోగలరు. ఇది ఎన్‌పీసీఐ విధించించిన పరిమితి. అయితే బ్యాంకులు విడి విడిగా పరిమితులు విధిస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ యూజర్‌ రోజులో రూ. లక్ష వరకు పంపుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక కెనరా బ్యాంక్‌ విషయానికొస్తే రూ. 25,000 పరిమితిని విధించింది. ఇదిలా ఉంటే పాన్‌ కార్డు లేకపోతే కోన్ని బ్యాంకులు నెల మొత్తానికి కూడా పరిమిత ట్రాన్సాక్షన్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. ఇదిలా ఉంటే రోజువారి ట్రాన్సాక్షన్స్‌ విషయంలోనూ నిబంధనలు ఉన్నాయి. ఒక రోజులో గరిష్టంగా 20 యూపీఐ లావాదేవీల కంటే ఎక్కువ చేసుకునే అవకాశం లేదు.

ఈ పరిమితి మించితే మళ్లీ 24 గంటల వరకు వేచి చూడాల్సిందే. ఇక గూగుల్ పే ద్వారా రోజులో రూ. లక్షల వరకు పంపుకోవచ్చు. ట్రాన్సాక్షన్‌ పరిమితి రోజుకు 20గా ఉంది. పేటీఎంలో కూడా గరిష్టంగా రూ. లక్ష వరకు పంపుకోవచ్చు. అయితే ఒక గంటలో కేవలం రూ. 20 వేల పరిమితి అమలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..