LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసే వ్యక్తి అదనపు డబ్బు అడుగుతున్నాడా? ఇలా ఫిర్యాదు చేయండి

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య పౌరుల బడ్జెట్ కుప్పకూలుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలను చూసి చాలా మంది తమకు వీలైనంత వరకు పొదుపు చేసేందుకు..

LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసే వ్యక్తి అదనపు డబ్బు అడుగుతున్నాడా? ఇలా ఫిర్యాదు చేయండి
Lpg Gas
Follow us
Subhash Goud

|

Updated on: Dec 07, 2022 | 5:48 PM

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య పౌరుల బడ్జెట్ కుప్పకూలుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలను చూసి చాలా మంది తమకు వీలైనంత వరకు పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, గ్యాస్ సిలిండర్ల వంటి నిత్యావసర వస్తువులు ఎంత ఖరీదు అయినా కొనాల్సిందే. సామాన్యుల ఈ అవసరాన్ని కొందరు సిలిండర్ డెలివరీ వ్యక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సిలిండర్ డెలివరీ కస్టమర్ల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు కంపెనీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక కస్టమర్‌ నుంచి రూ.25-30 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఈ విధంగా అదనపు డబ్బు అడగడం చట్టవిరుద్ధం. డెలివరీ చేసే వ్యక్తి అదనంగా డబ్బులు అడిగినట్లయితే ఫిర్యాదు చేయాలని గ్యాస్‌ కంపెనీలు సూచిస్తున్నాయి.

ముంబైలోగ్యాస్ సేవలను భారత్ గ్యాస్, ఇండెన్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ) అందిస్తున్నాయి. అందులో భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సిలిండర్లను ఇంటింటికీ పంపిణీ చేసే ఉద్యోగులకు నెలవారీ జీతం చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తారని, ఎవరైనా అలాంటి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చని గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగి తెలిపారు.

టోల్ ఫ్రీ నంబర్:

భారత్ గ్యాస్ – 1800224344

ఇవి కూడా చదవండి

ఇండన్ గ్యాస్ – 18002333555

హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ) – 18002333555

ఫిర్యాదు చేసే కస్టమర్ ముందుగా ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. వారి కస్టమర్ నంబర్, చిరునామా, అదనపు డబ్బును అభ్యర్థించిన ఉద్యోగి పేరును పేర్కొనాలి. గ్యాస్ కంపెనీ ఈ విషయాన్ని పరిశోధించి గ్యాస్ వినియోగదారులకు డబ్బు అదనంగా చెల్లించేలా చూస్తుంది. అలాగే సంబంధిత ఉద్యోగిపై తగు చర్యలు తీసుకుంటామని గ్యాస్‌ కంపెనీలు చెబుతున్నాయి. అయితే గ్యాస్‌ సిలిండర్‌ను డెలివరి చేసే వ్యక్తి పేరును తప్పనిసరిగ్గా తెలుసుకోవాలని సూచించారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి