Cement Price: ఇల్లు నిర్మించుకునే వారికి షాకింగ్ న్యూస్.. పెరగనున్న సిమెంట్ ధరలు..! ఎంతంటే
వస్తువుల డిమాండ్ మెరుగుపడడం, ధరల పెంపు, ఇన్‌పుట్ వ్యయం తగ్గడం వంటి కారణాలతో సిమెంట్ కంపెనీ షేర్లు పుంజుకున్నాయి. ఆల్ ఇండియా సిమెంట్ ధరలు సగటున రెండు..
వస్తువుల డిమాండ్ మెరుగుపడడం, ధరల పెంపు, ఇన్‌పుట్ వ్యయం తగ్గడం వంటి కారణాలతో సిమెంట్ కంపెనీ షేర్లు పుంజుకున్నాయి. ఆల్ ఇండియా సిమెంట్ ధరలు సగటున రెండు శాతం పెరిగాయి. వరుసగా మూడో సారిగా గత నెలలో 4 శాతం ధర పెరగగా, పశ్చిమ ప్రాంతంలో నెలవారీగా 2 శాతం పెరుగుదల నమోదైంది. మధ్య ప్రాంతాలలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ దక్షిణ, ఉత్తర ప్రాంతాలలో ఒక శాతం మధ్యస్థ పెరుగుదల కనిపించింది. విపరీతమైన డిమాండ్‌తో సిమెంట్ కంపెనీలు ఈ నెలలో మరో ధర పెంపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సిమెంట్ ధరలు గణనీయంగా పెరిగాయి.
కొత్త ఇల్లు నిర్మించుకోవాలంటేనే సామాన్యులకు భారంగా మారుతోంది. పేద కుటుంబాలకు ఆదాయం పెద్దగా లేకపోయినా.. ఇంటి నిర్మాణ ఖర్చులు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు బస్టాకు రూ.16 చొప్పున పెరిగింది. మరోసారి సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అభిప్రాయపడింది. గతనెలలోనే సిమెంట్ ధర బ్యాగ్‌కు రూ. 6-7 వరకు పెరిగాయి. ఈ నెలలో బస్తాకు రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశ పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సిమెంట్ డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నా.. ఉత్తర, తూర్పు, దక్షిణాది మార్కెట్లలో మాత్రం జోరందుకుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలో 50 కిలోల సిమెంట్ బస్తా రూ.370 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. ఇలా ధరలు పెరుగుతుండటంతో ఇల్లు నిర్మించుకునే వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో ధరలు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, ఉత్తర, తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో ధరలు పెరగవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ అంశం చర్చల దశలోనే ఉందని, కొద్దిరోజుల్లో దీనిపై కంపెనీలు ప్రకటించే అవకాశం ఉందని ఎమ్కే గ్లోబల్ వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి