AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahavatar Narsimha: ఏట్లా తీసేసారు మావా.. బాక్సాఫీస్ సంచలనం మహావతార్ నరసింహ.. డిలీటెడ్‌ సీన్ గూస్ బంప్సే..

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ. భక్త ప్రహ్లాదుడి భక్తి.. మహా విష్ణువు అవతారమైన నరసింహా అవతారాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై శుక్రవారం నాటికి 50 రోజులు పూర్తైంది.

Mahavatar Narsimha: ఏట్లా తీసేసారు మావా.. బాక్సాఫీస్ సంచలనం మహావతార్ నరసింహ.. డిలీటెడ్‌ సీన్ గూస్ బంప్సే..
Mahavatar Narsimha
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2025 | 2:41 PM

Share

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా మహావతార్ నరసింహ. దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ యానిమేటెడ్ పౌరాణిక ఇతిహాసం ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటి. కేవలం ₹ 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అన్ని అంచనాలను తారుమారు చేసి బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా దూసుకుపోయింది. తక్కువ అంచనాలతో థియేటర్లలోకి వచ్చి అనేక రికార్డులను బద్దలు కొట్టింది. మహావతార్ నరసింహ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹ 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

ఇవి కూడా చదవండి

ఇక ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12)న ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. 50 రోజులు పూర్తైనప్పటికీ ఇంకా 200కు పైగా థియేటర్లలో ఆడుతుందని నిర్మాణ సంస్థ తెలిపింది. జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటికీ అడియన్స్ బ్రహ్మారథం పట్టారు. ఇప్పటికీ బిక్ మై షోలో రోజుకు సుమారు 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ 50 రోజుల్లో బుక్ మై షో ద్వారా సుమారు 67 లక్షలకు పైగానే టికెట్లు కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..

ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తైన సందర్భంగా డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన డిలిటెడ్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలోతెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..