Tollywood: నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..
ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది అనుష్క శెట్టి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ట్వీట్ చేసింది. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

అనుష్క శెట్టి ఇటీవలే సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకున్నట్లు వెల్లడించింది. తాజాగా మరో హీరోయిన్ సైతం నెట్టింటికి గుడ్ బై చెప్పేసింది. ఇక నుంచి తాను ఎలాంటి పోస్టులు చేయనని.. అభిప్రాయాలను తన ఖాతాలో పోస్ట్ చేయనని చెప్పింది. ఆమె మరెవరో కాదు.. మలయాళంలో స్టార్ డమ్ సంపాదించుకున్న ఐశ్వర్య లక్ష్మి. దక్షిణాదిలో అనేక చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. గాడ్సే సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యింది. థగ్ లైఫ్, మామన్, కింగ్ ఆఫ్ కొత్త, మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సరసన సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
“ప్రస్తుతం నేను ఉంటున్న ఈ సినిమా అనే ఆటలో ఉండేందుకు సోషల్ మీడియా ఎంత అవసరమో నాకు తెలుసు. చిత్ర పరిశ్రమ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. కాలానికి అనుగుణంగా మారడం అవసరమని తెలుసుకున్నాను. అందుకే సోషల్ మీడియా నాకు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాను. ఆ నిర్ణయమే అలవాటు పడేలా చేసింది. కానీ ఇది నా పనిని పూర్తిగా డిస్ట్రబ్ చేసింది. నేను చేయాలనుకున్న పనులకు దూరం చేసింది. నాలో దాగి ఉన్న నిజమైన ఆలోచనలను సోషల్ మీడియా దోచుకుంది. నా చిన్న చిన్నఆనందాన్ని కూడా దుఃఖంగా మార్చేసింది. నా భాషను, పదాలను దెబ్బతీసింది. నా ఆనందాలన్నింటినీ తీసివేసింది.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
సోషల్ మీడియా వల్ల వచ్చిన ఇబ్బందులను ఎదుర్కోనేందుకు చాలా కష్టపడ్డాను. ఇంటర్నెట్ ఊహలకు తగినట్లుగా నేను జీవించలేకపోతున్నాను. ప్రస్తుతం రోజుల్లో ఇన్ స్టా లేని వారిని ప్రజలు మర్చిపోతారని తెలుసు. కానీ నేను ఆ సాహసం చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఇంటర్నెట్ కు దూరంగా ఉంటాను. నా జీవితంలో మరిన్ని బలమైన బంధాల ఏర్పడుతాయని అనుకుంటున్నాను. ఎప్పటిలాగే నన్ను గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి.. ప్రేమతో ఐశ్వర్యలక్ష్మి” అంటూ షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..

Aishwarya Lekshmi
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..








