Rajinikanth: రజినీకాంత్ పై అంతులేని అభిమానం.. 250 కిలోల విగ్రహాన్ని నిర్మించి పూజలు చేస్తోన్న యువకుడు.. ఎక్కడంటే..
అప్పట్లో హీరోయిన్ ఖుష్బూకు గుడి కట్టగా.. ఇటీవలే ఏపీలో ఓ వ్యక్తి సమంతకు గుడి కట్టి పూజించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ఖుష్బూ, అమితాబ్ బచ్చన్, నరేంద్రమోడీ మొదలైన ప్రముఖులను దేవుళ్లుగా నిర్మించి పూజించడం మనం ఇప్పటికే చూశాం. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్ విగ్రహాన్ని తయారు చేసి రోజూ పూజలు చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
దక్షిణాది చిత్రపరిశ్రమలో తమ అభిమాన హీరోల పట్ల ఉండే అభిమాను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఇష్టపడితే చాలు తమ ఫేవరేట్ హీరో కోసం ఏదైనా చేసేస్తారు. భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీ హీరోలను సైతం గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. ఇక స్టార్స్ పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు పండగే. భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేయడం.. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా దేవుళ్లుగా భావించి పూజిస్తారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలోని పలువురు తారలకు ఏకంగా గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అప్పట్లో హీరోయిన్ ఖుష్బూకు గుడి కట్టగా.. ఇటీవలే ఏపీలో ఓ వ్యక్తి సమంతకు గుడి కట్టి పూజించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ఖుష్బూ, అమితాబ్ బచ్చన్, నరేంద్రమోడీ మొదలైన ప్రముఖులను దేవుళ్లుగా నిర్మించి పూజించడం మనం ఇప్పటికే చూశాం. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్ విగ్రహాన్ని తయారు చేసి రోజూ పూజలు చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం, సినిమా రిలీజ్‌ల సమయంలో గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడం, అతని పేరు మీద టాటూ వేయించుకోవడం, కలిస్తే సెల్ఫీ దిగడం వంటివి అభిమానులకు సర్వసాధారణం. అయితే ఈ అభిమాని ఇతరుల కంటే కొంచెం భిన్నంగా ఆలోచించింది తన అభిమాన నటుడి కోసం గుడి కట్టాడు. మధురైకి చెందిన కార్తీక్ తన అభిమాన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ఓ గుడి కట్టించాడు. దానిలోపల 250 కిలోల బరువున్న రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పక్కనే తల్లిదండ్రులు ఫోటో, గణేశుడి ఫోటోను ఉంచి, రోజూ హారతి వెలిగించి అభిషేకం చేస్తున్నాడు. ఈ విషయాన్ని రజనీకాంత్ గమనించారో లేదో తెలియదు. అయితే అభిమాని రజనీకాంత్ విగ్రహానికి పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Watch | மதுரை: திருமங்கலத்தைச் சேர்ந்த கார்த்திக் என்பவர் நடிகர் ரஜினிகாந்த்துக்கு கோயில் கட்டி, 250 கிலோ எடை கொண்ட கருங்கல்லில் அவருக்கு சிலை வைத்து நாள்தோறும் வழிபட்டு வருகிறார்.#SunNews | #Madurai | @Rajinikanth pic.twitter.com/RXut6Ot1W4
— Sun News (@sunnewstamil) October 26, 2023
ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. కార్తీక్ అభిమానాన్ని కొందరు మెచ్చుకుంటే.. మరికొందరు పిచ్చి అని విమర్శిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న మాట కూడా నిజం. ఇక రజనీకాంత్ సినిమా టాపిక్‌లోకి వస్తే.. రీసెంట్‌గా జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తన 170వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ సినిమా 2024 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
After 33 years, I am working again with my mentor, the phenomenon, Shri Amitabh Bachchan in the upcoming Lyca’s “Thalaivar 170” directed by T.J Gnanavel. My heart is thumping with joy!@SrBachchan @LycaProductions @tjgnan#Thalaivar170 pic.twitter.com/RwzI7NXK4y
— Rajinikanth (@rajinikanth) October 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.