Madhavan: లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసిన హీరో మాధవన్.. మొదటి భారతీయుడిగా రికార్డు.. ధర ఎంతో తెలుసా?

సఖి సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు మాధవన్. ట్యాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ హీరోగా దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో నూ బిజీగా ఉంటోన్న మాధవన్ ఒక ఖరీదైన బైక్ ను కొనుగోలు చేశాడు.

Madhavan: లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసిన హీరో మాధవన్.. మొదటి భారతీయుడిగా రికార్డు.. ధర ఎంతో తెలుసా?
Madhavan

Updated on: Feb 09, 2025 | 4:20 PM

తెలుగుతో పాటు దాదాపు 7 భాషల్లో నటించిన అతి తక్కువ నటుల్లో మాధవన్ కూడా ఒకరు. ఈ ట్యాలెంటెడ్ నటుడికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటీవలే హిసాబ్ బరాబర్ అంటూ మరో సూపర్ హిట్ సినిమా ను తన ఖాతాలో వేసుకున్నాడు మాధవన్. కాగా ఈ హ్యాండ్సమ్ హీరోలకు బైకులంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన గ్యారేజ్ లో పలు బ్రాండెడ్ కంపెనీల లగ్జరీ బైకులు ఉన్నాయి. తాజాగా మరో ఖరీదైన బైకును కొనుగోలు చేశాడు మాధవన్. ఆస్ట్రియన్ మోటార్‌ సైకిల్ రంగంలో బిగ్గెస్ట్‌ బ్రాండ్‌గా గర్తింపు ఉన్న బ్రిక్ట్సన్‌ క్రోమ్‌వెల్ 1200 సీసీ బైక్‌ను తన గ్యారేజ్ లోకి తెచ్చుకున్నాడు. రెట్రో డిజైన్ తో పాటు మోడ్రన్ ఇంజినీరింగ్ వర్క్ స్టైల్ తో ఉన్న ఈ బైక్ ను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడిగా మాధవన్ రికార్డుల కెక్కారు. ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బ్రిక్ట్సన్‌ ఇటీవలే భారతదేశంలో తన విక్రయాలను ప్రారంభించింది. మోటోహాస్‌ భాగస్వామ్యంతో బ్రిక్ట్సన్‌ భారతదేశంలో అడుగు పెడుతోంది. బెంగళూరు, కోల్హాపూర్, గోవా, అహ్మదాబాద్ తదితర ప్రముఖ నగరాల్లో డీలర్‌షిప్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. జైపూర్, మైసూర్, కోల్‌కతా, పూణే, ముంబైలలో షోరూమ్‌లు రానున్నాయి. ఈ క్రమంలోనే మాధవన్ తొలి బైక్‌ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్‌ సామర్థ్యం ఉన్న లగ్జరీ బైక్ ను కొనుగోలు చేశారు. ఈ బైక్‌ కంపెనీకి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తుండడం విశేషం. కాగా కొత్త బైక్‌పై తన కుమారుడు వేదాంత్‌ పేరును చేర్చాడు మాధవన్.

ఇక ఈ లగ్జరీ బైక్ విషయానికి వస్తే.. ఇండియన్ మార్కెట్ లో దీని ధర సుమారు రూ. 7.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇక దీని ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవెల్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బ్రిక్ట్సన్‌ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్‌తో 108Nm టార్క్‌తో పనిచేస్తుంది. నిస్సిన్ బ్రేక్‌లు, బాష్ ABS, KYB అడ్జస్టబుల్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-థెఫ్ట్ కీ సిస్టమ్, TFT డిస్‌ప్లే, పిరెల్లి ఫాంటమ్ ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఈ బైక్ లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కొత్త బైక్ తో మాధవన్..

ప్రస్తుతం మాధవన్ లగ్జరీ బైక్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు మాధవన్ న్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి