AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Pregnancy: ‘సమంత ప్రెగ్నెన్సీ గురించి నాకు ముందే తెలుసు.. ఎవరికీ చెప్పలేదు’

హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమె నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ కావడం ఒక కారణమైతే త్వరలోనే ఆమె తల్లిగా ప్రమోషన్ పొందనుండడం మరో కారణం. అయితే సమంత ప్రెగ్నెన్సీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Samantha Pregnancy: 'సమంత ప్రెగ్నెన్సీ గురించి నాకు ముందే తెలుసు.. ఎవరికీ చెప్పలేదు'
Samantha Pregnancy
Basha Shek
|

Updated on: Jun 26, 2026 | 2:04 PM

Share

సమంత ఇటీవల తన ఫ్యాన్స్ కు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అందాల తార ఆ వెంటనే తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ మరో గుడ్ న్యూస్‌ పంచుకుంది. దీంతో సామ్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సమంత- రాజ్ నిడిమోరు దంపతులుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సమంత ప్రెగ్నెన్సీ గురించి మా ఇంటి బంగారం సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. అదేంటంటే.. మా ఇంటి బంగారం సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే సామ్‌కు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందట. అయితే అప్పటికే సినిమాలోని యాక్షన్ సీన్స్ మొత్తం షూట్ చేశారట. దీంతో షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది రాలేదని నందిని రెడ్డి పేర్కొంది. ఇక మిగిలిన షూటింగ్ లో సమంతకు కొంచెం ఎక్కువ విశ్రాంతి నిస్తూ పూర్తి చేశామని నందిని రెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. రెండో వారంలోనూ ఈ సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ వసూళ్లు 2 మిలియన్ డాలర్స్ ను అధిగమించాయని తెలుస్తోంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలో సమంతతో సహా భారీ తారగణమే ఉంది. శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రల్లో కనిపించారు. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు.  సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

వైజాగ్ లో సమంత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us