AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veturi Sundararama Murthy: రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డు.. తిరిగి ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ పాట క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంటుంది. అయితే ఈ పాటకు వచ్చిన జాతీయ అవార్డును వేటూరి సుందరరామమూర్తి తిరస్కరించిన వైనంపై దర్శకుడు కె. అజయ్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు.

Veturi Sundararama Murthy: రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డు.. తిరిగి ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..
Veturi Sundararama Murthy
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2026 | 1:50 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో మాతృదేవోభవ చిత్రం ఒక ఎమోషనల్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్ర విజయానికి కీరవాణి సంగీతం, ప్రత్యేకించి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకని అనే పాట ఎంతగానో దోహదపడింది. అయితే ఈ పాటకు జాతీయ అవార్డు లభించినప్పుడు, ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి దానిని స్వీకరించడానికి నిరాకరించడం వెనుక ఒక గొప్ప త్యాగం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఈ విషయాన్ని సినిమా దర్శకుడు కె. అజయ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జాతీయ అవార్డును తిరస్కరించడానికి వేటూరి చూపిన కారణం “తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించలేదు” అనేది. ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తిగత అవార్డుకు సంబంధించినది కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి సంబంధించినదని అజయ్ కుమార్ వివరించారు. అవార్డు ప్రకటించినప్పుడు, అజయ్ కుమార్ వేటూరిని ఆ అవార్డును స్వీకరించమని బతిమిలాడారు. దానికి వేటూరి “వద్దు అజయ్, నువ్వు సినిమా కష్టపడి చేశావు, పిక్చరైజేషన్ బాగా ఉండటం వల్ల కూడా వచ్చింది. నీ బాధ నాకు తెలుసు. కానీ ఇది కేవలం నాకు వచ్చిన వ్యక్తిగత అవార్డు. నేను ఎంత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానో చూడు. నాకు ఒక్కడి కోసమని కాదు, మన జాతి, మన భాష కోసం” అని అన్నారని గుర్తు చేసుకున్నారు.

ఈ చర్చ తర్వాత, వేటూరి నిర్ణయానికి అజయ్ కుమార్ కూడా కన్విన్స్ అయ్యారట. తెలుగు భాషాభిమానం, ఆత్మగౌరవం విషయంలో వేటూరి నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. అవార్డు వచ్చిందనే విషయం ఎక్కువ మందికి తెలిసినా, ఆయన తిరస్కరించారనే నిజం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని అజయ్ కుమార్ అన్నారు. అందుకు కారణం కూడా చాలా మందికి తెలియదని అన్నారు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలని, వేటూరి త్యాగం అందరికీ తెలియాలని ఆయన కోరారు. మాతృదేవోభవ సినిమా నిర్మాణ వ్యయం 1993లో కేవలం 30 లక్షలు మాత్రమే. ఆ రోజుల్లో ఇది చాలా తక్కువ మొత్తం. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి, దాదాపు 7 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

సినిమాలోని భావోద్వేగాలు, కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల ముందు రాయలసీమ బయ్యర్లకు సినిమా చూపించినప్పుడు, వారు తొలుత “ఏడుపు రాని మనుషులు” అని చెప్పినప్పటికీ, సినిమా చూసిన తర్వాత కళ్ళలో నీళ్లతో బయటకి వచ్చి, తమకు ఏడుపు వచ్చిందని, ఎంత రేటుకైనా సినిమా కొంటామని చెప్పడం సినిమా ప్రభావాన్ని తెలియజేస్తుంది. చోటా కె. నాయుడు క్లైమాక్స్ సన్నివేశంలో క్రేన్ షాట్ కోసం పడ్డ కష్టం, ఆయన సృజనాత్మకత కూడా సినిమా విజయానికి తోడ్పడింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

రాలిపోయే పువ్వా నీకు సాంగ్..

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us