Devara Movie: అది కోత ఇది లేత.. దేవర సినిమా నుంచి రెండో సాంగ్ అప్డేట్ వచ్చేసింది..
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా, హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇదివరకే వీరందరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఊర మాస్ రోల్ పోషిస్తున్నాడు తారక్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, అప్డేట్స్ చూస్తుంటే ఈసారి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.

ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. ముందు నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా, హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇదివరకే వీరందరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఊర మాస్ రోల్ పోషిస్తున్నాడు తారక్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, అప్డేట్స్ చూస్తుంటే ఈసారి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.
ఈ క్రమంలో ఇప్పటికే ఫ్యాన్స్ నిరీక్షణకు ముగింపు పలికారు మేకర్స్. మే 19న దేవర ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషి చేశారు. అలాగే నిన్న సాయంత్రం దేవరకు సంబంధించి ఓ చిన్న గ్లింప్స్ విడుదల చేసి ఆసక్తిని పెంచారు. తాజాగా ఈ మూవీ సెకండ్ సాంగ్ గురించి మరో అప్డేట్ ఇచ్చారు రామజోగయ్య శాస్త్రి. “ఒక్క రోజు ఓపిక పట్టండి.. మన “అని”…అబ్బా…వర్తు వెయిటింగ్.. “అని” పిస్తాడు…మనందరినోట…రెండో పాట రికార్డింగ్ కి వచ్చా చెన్నై, ఇది ఇంకో రకం ప్రకంపనం…అది కోత ఇది లేత #Devara” అంటూ ట్వీట్ చేస్తూ రెండో పాట అప్డేట్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత ఖుషి అవుతున్నారు.
ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దేవర ఫస్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో అనిరుధ్ ఏ రేంజ్ మ్యూజిక్ అందించాడనేది తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.
ఒక్క రోజు ఓపిక పట్టండి ❤️
మన “అని”…అబ్బా…వర్తు వెయిటింగ్ “అని” పిస్తాడు…మనందరినోట..
రెండో పాట రికార్డింగ్ కి వచ్చా చెన్నై ఇది ఇంకో రకం ప్రకంపనం…
అది కోత ఇది లేత ❤️#Devara
— RamajogaiahSastry (@ramjowrites) May 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




