Tollywood: ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ మూవీ టైటిల్ ఏంటో కనిపెట్టండి చూద్దాం.. చాలా పవర్ ఫుల్ గురూ

సినిమా పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పజిల్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే పైన కనిపిస్తున్న పజిల్ ట్రెండ్ అవుతుంది. పై ఫొటోలో ఓ సినిమా టైటిల్ ఉంది కనిపెట్టారా..

Tollywood: ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ మూవీ టైటిల్ ఏంటో కనిపెట్టండి చూద్దాం.. చాలా పవర్ ఫుల్ గురూ
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 28, 2023 | 4:26 PM

మనలో చాలా మందికి పజిల్స్ సాల్వ్ చేయడం అంటే భలే సరదా.. కొంతమంది పదవినోదంలాంటివి ఆసక్తిగా చేస్తుంటే మరికొంతమంది సినిమాలకు సంబంధించిన పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల మన మెదడు మరింత షార్ప్ అవుతుంది.. అలాగే నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఇక సినిమా పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పజిల్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే పైన కనిపిస్తున్న పజిల్ ట్రెండ్ అవుతుంది. పై ఫొటోలో ఓ సినిమా టైటిల్ ఉంది కనిపెట్టారా..? చాలా మంది ఈ మూవీ టైటిల్ ను కనిపెట్టలేక జుట్టు పీక్కున్నారు. మరి మీరు కనిపెట్టరా..? చాలా ఫేమస్ మూవీ టైటిల్ అది. ఇంతకు అదేంటంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న మూవీ టైటిల్ ఏంటో తెలుసా..? ఆ మూవీ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహ. బాలయ్య కు సింహ సెంటిమెంట్ ఉన్న విషయం తెలిసిందే. 2018లో వచ్చిన ఈ సినిమాకు కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా నయనతార నటించారు.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ బాలయ్య యాక్షన్స్ సీన్స్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం బాలయ్య సినిమాల విషయానికొస్తే ఇటీవలే వీరసింహారెడ్డి సినిమాతో హిట్ అందుకున్న నటసింహం. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే శ్రీలీల ఈ మూవీలో బాలకృష్ణ చెల్లిగా కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు బాలకృష్ణ.Jai SimhaJai Simha