Bro Movie: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న బ్రో.. ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఫిక్స్
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ నేడు (జులై 28) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వినోదయ సిత్తం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎక్కడ చూసిన బ్రో మూవీ మేనియా కనిపిస్తుంది. పవర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న బ్రో మూవీ థియేటర్స్‌లోకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ నేడు (జులై 28) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వినోదయ సిత్తం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి తరహా పాత్రలో కనిపించారు. ఇక ఈ మూవీ రిలీజ్ సందర్భంగా థియటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. నేటి ఉందయం నుంచి పవన్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు. పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో దుమ్మురేపుతున్నారు. అలాగే థియేటర్స్ లో ఈలలు గోలలతో అదరగొడుతున్నారు.
బ్రో సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ పై ఆసక్తి నెలకొంది. ఎంత కొత్త సినిమా అయినా.. ఎనిమిది వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. బ్రో సినిమా కూడా ఎనిమిది వారల తర్వాత ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
బ్రో మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి వారంలో బ్రో ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. బ్రో సినిమాకు తమన్ సంగీతం అందించగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు రచించారు. అలాగే కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు ఈ మూవీలో.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.