Darshan: రేణుక స్వామి హత్యకేసులో విస్తుపోయే నిజాలు.. కరెంట్ షాక్ ఇచ్చి మరీ..

రోజులు గడుస్తున్న కొద్దీ రేణుకాస్వామి హత్యకేసులో దారుణమైన అంశాలు బయటకు వస్తున్నాయి. మొదట భయపెట్టేందుకే కొట్టి హత్య చేశారని తెలిసింది, అయితే కేసు ముందుకు సాగడంతో దర్శన్ అండ్ గ్యాంగ్ రేణుకా స్వామిని చిత్రహింసలకు గురిచేసినట్లు తేలింది. నిన్న(జూన్ 15) దర్శన్ అండ్ గ్యాంగ్ ను కోర్టులో హాజరుపరచగా..

Darshan: రేణుక స్వామి హత్యకేసులో విస్తుపోయే నిజాలు.. కరెంట్ షాక్ ఇచ్చి మరీ..
Darshan
Follow us

|

Updated on: Jun 16, 2024 | 10:39 AM

కన్నడ ఇండస్ట్రీలో రేణుక స్వామి హత్యకేసు పెద్ద దుమారం రేపింది. నటుడు దర్శన్ ప్రేయసి కోసం రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడు. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ రేణుకాస్వామి హత్యకేసులో దారుణమైన అంశాలు బయటకు వస్తున్నాయి. మొదట భయపెట్టేందుకే కొట్టి హత్య చేశారని తెలిసింది, అయితే కేసు ముందుకు సాగడంతో దర్శన్ అండ్ గ్యాంగ్ రేణుకా స్వామిని చిత్రహింసలకు గురిచేసినట్లు తేలింది. నిన్న(జూన్ 15) దర్శన్ అండ్ గ్యాంగ్ ను కోర్టులో హాజరుపరచగా.. దర్శన్ అండ్ గ్యాంగ్ రేణుకా స్వామికి పైశాచికంగా చిత్రహింసలు పెట్టారని తెలుస్తోంది.

దర్శన్‌తోపాటు ఆయన ముఠాను మరో తొమ్మిది రోజులు రిమాండ్ కోరుతూ పోలీసులు దరఖాస్తు చేసుకున్నారు. నృపతుంగ రోడ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది, ప్రభుత్వం నియమించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ పోలీసుల తరపున వాదిస్తూ, రేణుకా స్వామికి హత్యకు ముందు విద్యుత్ షాక్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కోర్టులో దర్శన్ అండ్ గ్యాంగ్ దారుణంపై చిన్న హింట్ ఇచ్చిన సీనియర్ లాయర్ ప్రసన్నకుమార్.. రేణుకా స్వామికి కరెంట్ షాక్ ఇచ్చారని, ఆ కరెంట్ షాక్ ఇవ్వాలనుకున్న మెగ్గర్ మిషన్‌ను కూడా సీజ్ చేయాలని సూచించారు. నిందితుల బట్టలు, బూట్లు కూడా జప్తు చేయాలని వాదించారు. రేణుకాస్వామి హత్య జరిగిన రోజు జరిగిన సంఘటనలను కొందరు నిందితులు ఇప్పటికే వివరించగా, కొందరు అప్రూవర్లుగా కూడా మారారు. రేణుకా స్వామి మర్మాంగంపై దాడి చేసిన తర్వాత పడిపోయిన రేణుక స్వామిని ఎత్తుకుని గోడకు తగిలించి, సిగరెట్‌తో శరీరంపై కాల్చినట్టు తెలుస్తోంది. ట్యాంకర్ వాహనంతో ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయం అయ్యింది. ఆ తర్వాత అతన్ని హత్య చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles