AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: కల్మషం లేని మనసు.. అందరికీ మంచి చేసే వ్యక్తిత్వం.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా..?

చరిత్రలో తొలిసారి ఒక నటుడి మరణం అతడి సినిమాలతో కాకుండా.. చేసిన మంచి పనులతో నివాళి దక్కించుకోవడం గొప్ప విషయం. తెలుగు సినిమాలు చేయకపోయినా.. తెలుగు ఇండస్ట్రీతో ఇతడికి సన్నిహిత సంబందాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ యాక్టర్ హీరోగా ఫస్ట్ మూవీ చేశారు. మెహర్‌ రమేష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేశారు.

Viral Photo: కల్మషం లేని మనసు.. అందరికీ మంచి చేసే వ్యక్తిత్వం.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా..?
Actor Childhood Photo
Ram Naramaneni
|

Updated on: May 31, 2023 | 4:20 PM

Share

త్రో బ్యాక్ పిక్స్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. ఆ క్రమంలోనే సినిమా స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ ఆ ఫోటోలు ట్రెండింగ్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు మీ ముందుకు ఓ స్టార్ హీరో చిన్నప్పటి ఫోటోను తీసుకొచ్చాం. అతను రీల్ హీరో మాత్రమే కాదు. రియల్ హీరో కూడా. సమాజహితం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి.. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న వ్యక్తి. సినిమాల్లో 90 శాతం సక్సెస్ రేట్ ఉన్న పర్సన్. బాల నటుడిగా పరిచయమై అప్పుడే ప్రశంసలందుకుని.. హీరోగా మారిన తర్వాత పట్టుదలతో వరుస విజయాలతో కనడ రాష్ట్రానికి రాజకుమార అనిపించుకున్నాడు. అతని సినిమా ప్రస్థానం తెలుగు వారితో అనుబంధం మరిచిపోలేనివి. ఇప్పుడు మేము చెప్పేది ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది దివంగత పునీత్ రాజ్ కుమార్.

అప్పుగా అశేష కన్నడ ప్రేక్షకాదరణ. చేసిన సినిమాలు- 29.  జీవించింది కేవలం- 46 ఏళ్లు.. యాక్టర్- ప్లే బ్యాక్ సింగర్. టె టలివిజన్ ప్రెజంటర్- ప్రొడ్యూసర్ గా ఎన్నో సినీ సేవలు.. 90 శాతం సక్సెస్ రేట్.. 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో.. ఇవే కాదు.. పునీత్ రాజ్ కుమార్ అంటే 45 ఉచిత పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు.. తన తోటి నటీ నటులకూ పునీత్ కూ ఇదే తేడా. ఇదే ఆయన్ను అందనంత ఎత్తున నిలబెట్టింది. అప్పూతో కెరీర్ స్టార్ట్ చేసిన పునీత్ రాజ్ కుమార్.. నటసార్వభౌమగా.. తండ్రి నటవారసత్వం నిరూపిస్తూనే.. రాజకుమారుడిగా.. ఒక వెలుగు వెలుగుతూనే.. సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. తనకు దేవుడు అడక్కుండానే అన్నీ ఇచ్చాడు. కానీ అందరూ తనలా అదృష్టవంతులు కారు. తన చుట్టూ ఎందరో నిర్భాగ్యులున్నారు. వారికి అడుగడుగునా ఆపన్న హస్తం అందించాలి.. ఇదే పునీత్ తరచూ తన వాళ్లతో అనే మాట.

తండ్రి ఇచ్చిన పునీతమైన జన్మ- సొంత రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన కనబరిచారు.. పునీత్ రాజ్ కుమార్. కన్నడనాట ఎన్నో సేవా కార్యక్రమాలను తన తండ్రి పేరిట చేస్తూ వచ్చారు. అందుకే ఇంతటి- సినిమాలకు అతీతమైన ఫాలోయింగ్.  పునీత్ మరణ వార్త చెప్పడానికి ఒక కన్నడ టీవీ యాంకర్ అయితే బోరు బోరున విలపించిన దృశ్యం నెట్టింట వైరల్ అయ్యింది. ఆయన చనిపోయే ముందు చెప్పిన నాలుగు మాటలే ఇపుడు అభిమానులకు ఓదార్పు వచనాలు. పునీత్ ది ఎంత గొప్ప మరణమంటే.. ఆయన మరణ వార్త చెప్పడానికి కర్ణాటక ప్రభుత్వమే భయపడిపోయేంత. పరీక్షలు రాసేవాళ్లను సైతం ఇళ్లకు పంపించేసి.. స్కూళ్లకు సెలవులిచ్చేసి.. కేంద్ర హోంశాఖను అడిగి కేంద్ర బలగాలను పంపించమని కోరి.. ఆ తర్వాతగానీ విషాద వార్త ప్రకటించలేదు. అంతటి పాపులర్ హ్యూమన్ బీయింగ్ పునీత్ రాజ్ కుమార్.

Puneeth Raj Kumar

Puneeth Raj Kumar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!