Dharmavarapu Subramanyam: కడుపుబ్బా నవ్వించిన కమెడియన్.. మరణానికి ముందే చావు అంచుల దాకా తీసుకెళ్లిన ప్రమాదాలు..
తెలుగు వారి హృదయాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. 2013లో లివర్ క్యాన్సర్ సమస్యతో మరణించారు. ఆయన చివరి దశలో ఎలాంటి మానసిక పరిస్థితిని అనుభవించారనే విషయాలను.. మరణానికి ముందే చావు అంచుల దాకా తీసుకెళ్లిన ప్రమాదాల గురించి ఆయన తనయుడు రవి బ్రహ్మ తేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
వెండితెరపై నవ్వులను పంచి.. తమ కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనటుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. కామెడీలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉండేది. తెలుగు వారి హృదయాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. 2013లో లివర్ క్యాన్సర్ సమస్యతో ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించారు. ఆయన చివరి దశలో ఎలాంటి మానసిక పరిస్థితిని అనుభవించారనే విషయాలను.. మరణానికి ముందే చావు అంచుల దాకా తీసుకెళ్లిన ప్రమాదాల గురించి ఆయన తనయుడు రవి బ్రహ్మ తేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆయన జీవితంలో పలుమార్లు పెద్ద యాక్సిడెంట్స్ కు గురయ్యారని చెప్పుకొచ్చారు.
“నాన్న.. మూడు పెద్ద క్రిటికల్ పరిస్థితులను ఎదుర్కొన్నారు. మొదటిది.. 2001లో నువ్వు నేను సక్సెస్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు మీద బస్సు ఎక్కింది. వెంటనే జనాలు ఆయన్ని ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాలు కాపాడారు. చేతికి ఆపరేషన్ చేసి రాడ్స్ వేశారు. తలకు 21 కుట్లు వేశారు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి చాలా మంది పరామర్శఇంచారు. ఆ ప్రమాదం నుంచి ఆయన నిదానంగా కోలుకున్నారు. ఆ తర్వాత శ్వేతనాగు సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
బెంగుళూరు సమీపంలోని ఓ అడవిలో షూటింగ్ జరిగింది. ఆ సినిమా తర్వాత ఆయన గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాలేదు. వెళ్లి చూస్తే బెడ్ పై పడిపోయి ఉన్నారు. స్పృహలో లేరు. వెంటనే హాస్పిటల్లో చేర్పించాము. అడివిలో ఏదో కీటకం కుట్టడం వలన అలా జరిగిందని.. అందుకు స్మోక్ చేయడం కూడా ఓ కారణమని అన్నారు. ఆ తర్వాత మరోసారి ఆయనకు మరోసారి ఆరోగ్యం పాడైంది. పదిరోజుల పాటు కోమాలోనే ఉన్నారు. కానీ మూడో సారి ఆయన్ను కాపాడుకోలేకపోయాం. 2012లో నాన్నకు ఆరోగ్యం పాడైనప్పుడు డాక్టర్స్ చెక్ చేసి లివర్ క్యాన్సర్ అని.. అది కూడా ఫోర్త్ స్టేజ్ అని చెప్పారు. 11 నెలల కంటే ఎక్కువ బతకలేరని చెప్పారు. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. నాన్నగారికి బ్రహ్మానందం గారు ఫోన్ చేసేవారు. ఇంటికి వచ్చి చూస్తానంటే రావొద్దని అనేవారు. ఆరు నెలల తర్వాత నేను వస్తాను ఆగు అనేవారు. ఇప్పుడున్న పరిస్థితిల్లో నన్ను చూస్తే తట్టుకోలేవు అనేవారు. చివరి వరకు ఆయనను ఇంటికి రానివ్వలేదు. 2013 డిసెంబర్ 7న నాన్న చనిపోయిన తర్వాత బ్రహ్మానందం ఇంటికి రాలేదు. ” అంటూ చెప్పుకొచ్చారు.