RGV: ‘వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా’.? ‘నిజం’తో రేపు ప్రజల ముందుకు వస్తానంటోన్న వర్మ.

సంచలనాలకు మారుపేరు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఎలాంటి కాంట్రవర్సీ లేకపోతే తానే ఓ కాంట్రవర్సీని సృష్టిస్తుంటాడు. ఒకప్పుడు సినిమాలతో ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన వర్మ ఇప్పుడు.. సోషల్‌ మీడియాలో ద్వారా నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే..

RGV: 'వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా'.? 'నిజం'తో రేపు ప్రజల ముందుకు వస్తానంటోన్న వర్మ.
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 24, 2023 | 6:41 PM

సంచలనాలకు మారుపేరు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఎలాంటి కాంట్రవర్సీ లేకపోతే తానే ఓ కాంట్రవర్సీని సృష్టిస్తుంటాడు. ఒకప్పుడు సినిమాలతో ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన వర్మ ఇప్పుడు.. సోషల్‌ మీడియాలో ద్వారా నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే రామూయిజంతో యూట్యూబ్ ద్వారా చాలా మందికి చేరువైన వర్మ తాజాగా మరో సరికొత్త యూట్యూబ్‌ ఛానల్‌కు శ్రీకారం చుట్టారు. నిజం పేరుతో ఛానల్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ యూట్యూబ్‌ ఛానల్‌ను ఏప్రిల్‌ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు.

తొలి ఎపిసోడ్‌తోనే సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు వర్మ. నిజం ఛానల్‌లో తొలి ఎపిసోడ్‌గా వివేకా హత్య కేసును వర్మ ప్రస్తావించనున్నారు. ఇందులో భాగంగానే ‘రామ్‌ గోపాల్ వర్మ ప్రెస్‌ నోట్‌’ పేరుతో ఓ లేఖను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇందులో వర్మ.. వివేకా హత్య వెనక నిజం లో , అబద్దముందా ? అనే ఎపిసోడ్ తో నా “నిజం” ఛానల్ ప్రారంభం “నేను ప్రారంభించబోయే ” నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది. అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి .. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు. కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. .. దానికి మోసపోయి ,చచ్చింది అని అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడు తూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది’ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

మరి ఈ నిజంతో వర్మ ఎలాంటి చర్చకు దారి తీస్తారో, ఎన్ని సంచలనాలకు తెర లేపుతారో చూడాలి. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడీ కేసుపై వర్మ స్పందిస్తుండడంతో అందరి దృష్టి పడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ