Jr.NTR: ప్రపంచంలోని అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ పై ‘సింహ్రాద్రి’ ప్రదర్శన.. ఏ హీరోకు దక్కని రికార్డ్ తారక్ సొంతం..

ఇప్పటికే ఒక్కడు, జల్సా, ఖుషి, ఆరెంజ్, బిల్లా చిత్రాలు విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ రీరిలీజ్ కు సిద్ధమయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా సింహాద్రి. ఈ మూవీని మరోసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Jr.NTR: ప్రపంచంలోని అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ పై 'సింహ్రాద్రి' ప్రదర్శన.. ఏ హీరోకు దక్కని రికార్డ్ తారక్ సొంతం..
Simhadri Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 24, 2023 | 5:29 PM

గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో డిజాస్టర్ అయిన చిత్రాలు ఇటీవల మళ్లీ విడుదలై భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇక పాత సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసేందుకు సినీ ప్రియులు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్టార్ హీరోస్ బెస్ట్ మూవీస్ మళ్లీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు కొత్త సినిమాలకు పోటీగా ఓల్డ్ మూవీస్ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఒక్కడు, జల్సా, ఖుషి, ఆరెంజ్, బిల్లా చిత్రాలు విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ రీరిలీజ్ కు సిద్ధమయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా సింహాద్రి. ఈ మూవీని మరోసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అంటే మే 20న ఈ సినిమాను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇప్పటివరకు ఏ హీరో రీరిలీజ్ కు దక్కని రికార్డ్ తారక్ సొంతం కాబోతుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఉన్న ఐమ్యాక్స్ స్క్రీన్ పై ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్. ఇప్పటివరకు ఏ హీరో సినిమా రీరిలీజ్ ఈ మెల్ బోర్స్ లోని ఐమ్యాక్స్ థియేటర్లలో రాలేదు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

సింహాద్రి సినిమా రీరిలీజ్ ఐమ్యాక్స్ స్క్రీన్ పై ప్రదర్శించనున్న విషయాన్ని స్వయంగా ఐమ్యాక్స్ మెల్ బోర్న్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆ స్క్రీన్ పై ఉదయం 9 గంటలకు సింహాద్రి సినిమాను ప్రదర్శించనున్నారు. టికెట్ ధర 28 ఆస్ట్రేలియన్ డాలర్లుగా తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1533. ఇక ప్రీమియం టికెట్ ధర అయితే 44.50 అంటే సుమారు. 2437 అన్నమాట. ఐమ్యాక్స్ మెల్‌బోర్న్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుంటే అదనంగా 2 డాలర్ల బుకింగ్ ఫీ కూడా ఉంటుంది. సింహాద్రి సినిమాకు 4కే క్వాలిటీతో తారక్ అభిమానులే రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్లను కష్టాల్లో ఉన్న తారక్ అభిమానులకు అందించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ