Krithi Shetty: ఆ సీన్ అవసరమా..? తీసేయోచ్చా..? అని దర్శకుడిని అడిగిందంట అందాల కృతి శెట్టి..

న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్ లో అడుగుపెట్టింది

Krithi Shetty: ఆ సీన్ అవసరమా..? తీసేయోచ్చా..? అని దర్శకుడిని అడిగిందంట అందాల కృతి శెట్టి..
Kruthi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 26, 2021 | 7:47 AM

Krithi Shetty: న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్ లో అడుగుపెట్టింది. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా వ్యవహరించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగావిడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో  కృతి శెట్టి  మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది అంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను అని అంది కృతి. నాకు వచ్చే పాత్రలపై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా ఉంటుంది.. ఆమె అలవాట్లు ఏంటి? ఆమె ఎలాంటి పాటలు వింటుంది అని నేనే సపరేట్‌గా రాసుకుంటాను అని చెప్పుకొచ్చింది.  అలాగే నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే చాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి అని అంది.

నాని గారితో నటించడం అంటే మొదట్లో నాకు భయం వేసింది. కానీ ఆయన సెట్‌లొ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన వరకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరి పర్ఫామెన్స్ చూస్తారు. బాగుందని అంటారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత కంఫర్ట్‌గా నటించగలిగాను. బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాను. కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను. శ్యామ్ సింగ రాయ్‌లో వాటితో కథ ముడి పడి ఉంది.

ఉప్పెన సినిమాలో నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. కానీ ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే చాన్స్ వచ్చింది. ఉప్పెన తరువాత నాకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. కానీ మళ్లీ మళ్లీ అలాంటి పాత్రనే ప్రేక్షకులకు ఎందుకు చూపించాలి. కావాలంటే వారు నెట్ ఫ్లిక్స్‌లో ఉప్పెన చూస్తారు. కొత్తగా ఉంటుందనే ఈ పాత్రను ఎంచుకున్నాను. భిన్న పాత్రలను చేయాలని నాకు ఉంటుంది. స్టోరీ కంటే నా పాత్ర ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తాను. ఇంటర్వెల్ వరకు ఉంటుందా? తరువాత ఉండదా? అని ఆలోచించను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉందా? లేదా? అని అనుకుంటాను. రకరకాల పాత్రలను చేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కామెడీ పాత్రలను చేస్తే ఆ టైమింగ్ తెలుస్తుంది. అందుకే విభిన్న పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి ‘సామి సామి’ అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..