Krithi Shetty: ఉప్పెన సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పిన బేబమ్మ…

తొలి సినిమాతో బేబమ్మ గా తనదైన ముద్రవేసింది అందాల భామ కృతి శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతి.

Krithi Shetty: ఉప్పెన సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పిన బేబమ్మ...
Kruthi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 18, 2022 | 7:23 PM

తొలి సినిమాతో బేబమ్మ గా తనదైన ముద్రవేసింది అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty). బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతి. ప్రస్తుతం ఈ భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో హిట్ అందుకుంది కృతి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో కృతిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కృతి మాట్లాడుతూ.. నిజ జీవితానికి చాలా దగ్గరగా వున్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఫోన్ చేసి ”నన్ను నేను స్క్రీన్ పై చూసుకున్నట్లువుంది” అని చెపుతుంటే చాలా ఆనందంగా వుంది. ఒక నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. ఇంత మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. అలాగే..

నేను ప్రతి సినిమాకి, పాత్రకి హోమ్ వర్క్ చేస్తాను. పాత్రని వివరంగా రాసుకుంటాను. అప్పుడు ఆ పాత్రని అభినయించడం సులువౌతుంది. సెట్‌లో ఒక సీన్ జరుగుతున్నపుడు నిజంగానే అది నా జీవితంలో జరుగుతుందని చేస్తాను. ఇలా చేసినప్పుడు చాలా సహజమైన హావ భావాలు పలుకుతాయని నమ్ముతాను. ఈ పాత్రని కూడా అలానే చేశాను. కెరీర్ బిగినింగ్ లోనే ద్విపాత్రాభినయం చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల పాత్రని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక నటిగా చాలా ఆనందంగా వుంది. నిజానికి నేను డాక్టర్ ని కావాలని అనుకున్నాను. ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం, తొలి సినిమా ఉప్పెన అవకాశం దొరకడం, తర్వాత మంచి మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మరింత కష్టపడి మరిన్ని మంచి పాత్రలు , సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది బేబమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?