AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krish Jagarlamudi: అందుకే హరి హర వీరమల్లు నుంచి బయటకు వచ్చా.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ క్రిష్

హరి హర వీరమల్లు సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమాను మొదట క్రిష్ జాగర్లమూడి ప్రారంభించారు. అయితే మధ్యలోనే ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ మిగతా సినిమాను పూర్తి చేశారు.

Krish Jagarlamudi: అందుకే హరి హర వీరమల్లు నుంచి బయటకు వచ్చా.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ క్రిష్
Director Krish Jagarlamudi
Basha Shek
|

Updated on: Aug 31, 2025 | 7:19 PM

Share

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి, కొండ పొలం.. ఇలా వైవిధ్యమైన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. అయితే శాతకర్ణి తర్వాత క్రిష్ తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కంగనా రనౌత్ తెరకెక్కించిన మణికర్ణిక మూవీ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమా విషయంలోనూ మళ్లీ అదే రిపీటైంది. కొంత భాగం షూటింగ్ పూర్తయ్యక ఈ మూవీ నుంచి బయటకు వచ్చారు క్రిష్. ఇప్పుడు ఘాటి అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులన అలరించేందుకు రెడీ అయ్యాడీ స్టార్ డైరెక్టర్. చింతకింది శ్రీనివాసరావు రాసిన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 05న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఘాటీ చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ క్రిష్ తో పాటు నటుడు విక్రమ్‌ ప్రభు, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి హరిహర వీరమల్లు’ సినిమా ప్రస్తావన తీసుకురాగా క్రిష్ అసలు విషయం చెప్పారు.

‘ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ అంటే నాకు ఇష్టం, ప్రేమ. నిర్మాత ఎ.ఎం. రత్నంపై కూడా గౌరవం ఉంది. ఆయన నిర్మించిన సినిమాల పోస్టర్లు చూసి స్ఫూర్తిపొందినవాడిని. ‘హరిహర వీరమల్లు’ని నేను కొంతభాగం చిత్రీకరించాను. కానీ కొవిడ్‌కు తోడు కొన్ని వ్యక్తిగత సమస్య వల్ల ఆ సినిమా షూటింగ్‌ షెడ్యూళ్లలో మార్పులొచ్చాయి. ఆ కారణాల వల్ల నేను ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చా. తర్వాత ఆ సినిమా చిత్రీకరణను జ్యోతికృష్ణ కొనసాగించారు’ అని చెప్పుకొచ్చారు క్రిష్.

జులై 24న థియేటర్లలో విడుదలైన హరి హర వీరమల్లు సినిమా ఓ మోస్తరుగా ఆడింది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఘాటి సినిమా విషయానికి వస్తే.. చైతన్య రావు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, దేవికా ప్రియ దర్శిని, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్