Mahalakshmi Ravinder: అర్ధరాత్రి భర్త చేసిన పనికి బుల్లితెర నటి ఎమోషనల్.. భావోద్వేగ పోస్ట్ చేసిన మహాలక్ష్మి..
ప్పటికే భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. నిర్మాత రవీందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశగా మారింది. ఇక వీరి పెళ్లి తర్వాత మహాలక్మీ జంటపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా తన భర్తతో కలిసి ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ సంతోషంగా గడుపుతుంది. ఈ జంట నిత్యం వార్తలలో నిలుస్తుంటారు.

కోలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు మహాలక్ష్మి సుపరిచితమే. ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‌ను ఆమె వివాహం చేసుకోవడం సౌత్ ఇండియాలో ఆమె పేరు మారుమోగింది. అప్పటికే భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. నిర్మాత రవీందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశగా మారింది. ఇక వీరి పెళ్లి తర్వాత మహాలక్మీ జంటపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా తన భర్తతో కలిసి ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ సంతోషంగా గడుపుతుంది. ఈ జంట నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ఇటీవలే రవీందర్ ఓ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ పై రివ్యూలు ఇస్తూ సందడి చేశారు. ఇక తాజాగా తన భర్త గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది మహాలక్ష్మి. ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు తన భర్త స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది.
“ఈరోజు నా పుట్టినరోజు అంతులేని ప్రేమ భావోద్వేగాలతో నిండిపోయింది. ముందు అర్దరాత్రి రుచికరమైన కేక్ తో నన్ను మేల్కోలిపాడు. కేక్ చూసి ఆశ్చర్యపోయాను. అంత మంచి మనసు ఉన్న వ్యక్తి నాకు భర్తగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటికీ అతడిని ప్రేమిస్తున్నాను. అలాగే నా తల్లి, సోదరుడు నన్ను మానసిక వికలాంగులు ఆశ్రమాన్ని తీసుకెళ్లారు. వారికి ఆహారం అందించారు. అందుకు వారికి కృతజ్ఞతలు. బంగ్లాదేశ్ నుంచి మా నాన్న నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మా మామయ్య నుంచి ఆశిస్సులు వచ్చాయి. నాపై నా కుటుంబం చూపించే ప్రేమ.. అనుబంధానికి చాలా ధన్యవాదాలు. నా కొడుకు, శ్రేయోభిలాషులు, స్నేహితులు నాకు ఆశీర్వాదులు అందించిన వారికి కృతజ్ఞతలు. ” అంటూ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు నెటిజన్స్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
View this post on Instagram
అలాగే మహాలక్ష్మి తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చనిపోయాక తన అవయవాలను డోనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. చనిపోయిన తర్వాత తన ఆర్గాన్స్ ఇతరుల రూపంలో బతికే ఉంటాయని తెలిపింది. తన నిర్ణయంతో అవసరమైనవారికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నట్లు తెలిపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
