2009లో మగధీర నుంచి 2019లో వినయ విధేయ రామ వరకు కనీసం ఏడాదికో సినిమా చేసారు.. మధ్యలో 2011, 2017 మాత్రమే ఖాళీగా వదిలేసారు చరణ్. కానీ రాజమౌళితో RRR ఎప్పుడైతే కమిటయ్యారో.. అప్పట్నుంచి గ్యాప్ తప్పట్లేదు. 2020, 2021 ఖాళీగానే వెళ్లిపోయాయి. ఆ లోటు తీరేలా ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్.