Tollywood: సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా మారిన హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

|

Mar 04, 2025 | 11:09 AM

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఎంట్రీ ఇస్తుంటారు. ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతారు. కానీ అ క్రేజ్ మాత్రం తర్వాత కాపాడుకోలేకపోతారు. కొందరు తారలు మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమవుతారు. తమకు నచ్చిన రంగంలో దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు.

Tollywood: సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా మారిన హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Reshma Rathore
Follow us on

బుల్లితెరపై నటిగా కెరీర్ ప్రారంభించిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్ గా సందడి చేసింది. పలు సినిమాల్లో కథానాయికగా నటించి అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అందం, అభినయంతో ఆక్టటుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. అలాగే నెమ్మదిగా సినిమా ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. అప్పుడే ఇండస్ట్రీకి దూరమై రాజకీయాల్లో చేరింది. అదే సమయంలో లాయర్ కోర్సు పూర్తి చేసింది. ఇప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ రేష్మ రాథోడ్.

తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన ఆమె వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తిచేసింది. 2012లో వెంకటేశ్, త్రిష జంటగా నటించిన బాడీగార్డ్ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించింది. అదే ఏడాది డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈరోజుల్లో సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో హీరోయిన్ గా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న రేష్మ.. ఆ తర్వాత దివంగత హీరో ఉదయ్ కిరణ్ తో కలిసి జై శ్రీరామ్ అనే సినిమాలో నటించింది. తెలుగులో లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం చిత్రాల్లో నటించింది. అళాగే తమిళం, మలయాళం భాషలలోనూ పలు సినిమాల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

2017 తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరిన ఆమె.. అటు లాయర్ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..